అల్లు అరవింద్, కార్తికేయ, బన్నివాసు,జిఏ2 పిక్చర్స్ - ‘చావు కబురు చల్లగా’ విజువల్ సర్‌ప్రైజ్‌కి హ్యూజ్ రెస్పాన్స్
ఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో వరుస విజయాలతో కేరాఫ్ సక్సస్ బ్రాండ్‌ని సొంతం చేసుకున్న యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా, హ్యాపెనింగ్ ఎనర్జిటిక్ హీరో కార్తీకేయ, లక్కీ బ్యూటీ లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. టైటిల్‌తోనే అటు చిత్ర పరిశ్రమ వర్గాల్లో, ఇటు సాధరణ ప్రేక్షకుల్లో ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభించడం విశేషం. దాంతో పాటే విడుదల చేసిన హీరో కార్తికేయ పోషించిన ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్ సైతం సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ అందుకుంది. అయితే ఈ నెల 21న కార్తికేయ బర్త్‌డే సందర్బంగా సోషల్ మీడియా వేదికగా జిఏ2 పిక్చర్స్ వారు కార్తికేయని ఏం వరం కావాలో కోరుకో అన్నారు. దానికి కార్తికేయ నాకు టీజర్ ఇవ్వండి అని అడగగా ఓవర్ టు డైరక్టర్ అంటూ జిఏ2 నుండి రిప్లై రావటం దాని వెంటనే దర్శకుడు సర్‌ప్రైజ్ అంటూ ఎనౌన్స్ చేశారు.
ఇదంతా ఫాలో అవుతున్న నెటిజన్స్ ఆ సర్‌ప్రైజ్ కోసం ఎదురు చూసారు. ఈరోజు 11.47 నిమిషాలకి విడుదల చేసిన ఈ వీడియో సర్‌ప్రైజ్‌కి నిజంగా సర్‌ప్రైజ్ అయ్యారు. కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరి మాడ్యూలేషన్ చూస్తే మళ్ళీ చూడాలనిపించేలా వుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు ఆమని, భద్రం వేసిన డైలాగ్స్ కూడా సామాన్య ప్రేక్షకులకి దగ్గరగా వున్నాయి. ఈ విజువల్ చాలా క్యూట్‌గా వుండటమే కాకుండా బన్నివాసు, జిఏ2 పిక్చర్స్ స్టాండర్స్ మరొక్కసారి నిరూపించేలా వుండటం విశేషం. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ అంతా హీరో కార్తికేయకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాత బన్నివాసు గారు మాట్లాడుతూ.. జిఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో భలేభలే మగాడివోయ్, గీతగోవిందం, ప్రతిరోజు పండగే చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి. అలాంటి బ్యానర్‌లో వచ్చే ప్రతి చిత్రంపై ప్రేక్షకులకి అంచనాలు వుంటాయి. వారిని దృష్టిలో పెట్టుకుని చిత్రాలు నిర్మిస్తున్నాం. కార్తికేయ గత చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా వుండాలి అనుకున్నాం. మేము అనుకున్న దానికంటే కూడా కార్తికేయ పాత్రల పరకాయ ప్రవేశం చేశారు. ఈ విజువల్ చూస్తేనే మీకు అర్ధమవుతుంది. కార్తికేయ డేడికేషన్ మా అవుట్‌పుట్ అంత అందంగా వచ్చింది. దర్శకుడు కౌశిక్ కొత్తవాడయినా చాలా టాలెంట్ వున్నవాడు. చెప్పిన పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. రెగ్యులర్ సినిమా కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ చిత్రానికి సంబందించి మరిన్ని సర్‌ప్రైజ్‌లు త్వరలో వస్తాయి. అని అన్నారు
తారాగణం
కార్తీకేయ, లావణ్య త్రిపాఠి, ఆమని తదితరులు
సాంకేతిక వర్గం
సమర్పణ - అల్లు అరవింద్
బ్యానర్ - జీఏ2 పిక్చర్స్
నిర్మాత - బన్నీ వాసు
సహనిర్మాత -- సునిల్ రెడ్డి
ఎడిటర్-- సత్య జి
ఆర్ట్-- జి ఎమ్ శేఖర్
సినిమాటోగ్రాఫర్ - సునీల్ రెడ్డి
అడిషినల్ డైలాగ్స్ .. శివ కుమార్ భూజుల
ప్రోడక్షన్ డిజైనర్.. మనిషా ఏ దత్
కాస్ట్యూమ్ డిజైనర్.. మౌనా గుమ్మడి
పి ఆర్ ఒ.. ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్స్.. శరత్ చంద్ర నాయిడు, రాఘవ కరుటూరి
మ్యూజిక్ - జకీస్ బిజాయ్
దర్శకుడు - కౌశిక్ పెగళ్లపాటి