Advertisementt

‘మెరిసే మెరిసే’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Sat 19th Sep 2020 07:10 PM
director,tharun bhascker,merise merise,title poster,release  ‘మెరిసే మెరిసే’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Director Tharun Bhascker Unveils Title Poster Of Merise Merise ‘మెరిసే మెరిసే’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Advertisement
Ads by CJ

‘మెరిసే మెరిసే’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్

కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ‘మెరిసే మెరిసే’. ఈ చిత్రంలో హుషారు ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా శ్వేతా అవస్తీ హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ...

ప్రస్తుతం మెరిసే మెరిసే చిత్రం డిఐ వర్క్స్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన మా సినిమా థీమ్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. మా మూవీ ఫస్ట్ లుక్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన మా సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని తెలిపారు.

నటీనటులు:

దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, కాటలిన్, శశాంక్, నానాజీ

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత: వెంకటేష్ కొత్తూరి

దర్శకత్వం: పవన్ కుమార్. కె

కెమెరామెన్:  నగేష్ బన్నెల్

సంగీతం: కార్తిక్ కొడగండ్ల

Director Tharun Bhascker Unveils Title Poster Of Merise Merise:

Merise Merise movie first look Launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ