Advertisementt

ఈ సినిమా కూడా ఓటీటీలోనే విడుదల!

Thu 17th Sep 2020 03:10 PM
colour photo,world premiere,aha,ott  ఈ సినిమా కూడా ఓటీటీలోనే విడుదల!
Colour Photo movie Release Date announced ఈ సినిమా కూడా ఓటీటీలోనే విడుదల!
Advertisement
Ads by CJ

అన‌తికాలంలోనే అంద‌రి చేత ఆహా అనిపించుకున్న ఆహ ఓటిటి ద్వారా అమృత ప్రొడ‌క్ష‌న్స్ వారి ‘క‌ల‌ర్ ఫోటో’ అక్టోబ‌ర్ 23 న గ్రాండ్ రిలీజ్‌

హ్రుద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట చిత్రాల‌తో సినిమా ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బ న‌వ్వించిన సూప‌ర్‌హిట్ నిర్మాణ ‌సంస్థ‌ అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై,  శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’. ఈ సినిమాతో సందీప్ ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ఇటీవ‌ల ప‌లు చిత్రాల్లో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న న‌టుడు సుహాస్, చాందీని చౌద‌రి జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ న‌టుడు సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వైవా హ‌ర్ష మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ ద్వారా హృద‌య‌కాలేయం, కొబ్బ‌రి మ‌ట్ట వంటి సూప‌ర్ హిట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్స్‌ని అందించిన నిర్మాత సాయి రాజేశ్, ఇప్పుడు ‘క‌ల‌ర్ ఫోటో’ చిత్రానికి క‌థ కూడా అందించ‌డం విశేషం. ఇటీవ‌లే క‌ల‌ర్ ఫోటో టీమ్ విడుద‌ల చేసిన టీజ‌ర్ కు, సాంగ్ కి ఆన్ లైన్‌తో పాటు వివిధ వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఈ మూవీ టీజ‌ర్‌కు యూట్యూబ్‌లో మిలియ‌న్లు వ్యూస్ వ‌చ్చాయి.

ఇక ఈ చిత్రానికి కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్ప‌టికే టీజర్‌లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వివిధ మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్‌తో ట్రెండ్ అవుతున్న‌ట్లుగా క‌ల‌ర్ ఫోటో యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు. ఈ లాక్‌డౌన్‌లో క‌ల‌ర్‌ఫోటో పిక్చ‌ర్స్‌, విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో మొద‌టిస్థానంలో వున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా ఆక‌ట్టుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 23న విజ‌య‌ద‌శ‌మి సంధ‌ర్బంగా విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు ముహుర్తం ఖ‌రారు చేశారు.

అయితే ఇదే లాక్‌డౌన్‌లో ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యి అంద‌రి చేత ఆహ అనిపించుకున్న ఆహ ఓటిటి ద్వారా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర‌కి వ‌స్తుంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇంటికొచ్చి ఇస్తాం మీ మొబైల్స్‌, టివి, లాప్‌టాప్‌లు మా కోసం ఆన్ చేయండి చాలు ఇంటికి వ‌చ్చి న‌వ్వించ‌డం మాకు కొత్త కాదు అంటున్నాడు.. ద‌ర్శ‌కుడు సందీప్‌.

చిత్రం: కలర్ ఫోటో

బ్యానర్: అమృత ప్రొడక్షన్

సమర్పణ: శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్

నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు

నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : సందీప్ రాజ్

కథ: సాయి రాజేష్ నీలం

ఆర్ట్: క్రాంతి ప్రియం

కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి

ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్

ఫైట్స్: ఎ.విజయ్

సహ నిర్మాత : మణికంఠ

లైన్ ప్రొడ్యూసర్ : గంగాధర్

పీఆర్ఓ: ఏలూరు శ్రీను, వంశి కాక‌

Colour Photo movie Release Date announced:

Colour Photo’s World Premiere on on aha!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ