జై చిరంజీవ ఫిలింస్ అఖిల టైటిల్ ఆవిష్కరణ
అక్ష ప్రధాన పాత్రలో జయ సింహ హీరోగా వస్తోన్న సినిమా అఖిల. సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతున్న ఈ చిత్ర టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమం హైదరాబాద్ లో TFCC(తెలుగు ఫిలిం ఛాంబర్ ఆ కామర్స్)లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు సీనియర్ నిర్మాత ప్రసన్న కుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..మనల్ని మనం ముందు గుర్తించాలని చెప్పే శెట్టి చిరంజీవిగారికి ఈ అఖిల సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. చిత్ర దర్శకుడు మోహన్ రావు చాలా బాధ్యతగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించిన అందరు నటీనటులకు సాంకేతిక నిపుణులకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ తరువాత మొదటి ప్రెస్మీట్ అఖిల. ఈ సినిమా దర్శకుడు మోహన్ రావ్, నిర్మాత శెట్టి చిరంజీవిగారి పిలుపు మేరకు రావడం జరిగింది. ఇలాంటి సినిమాలకు పబ్లిసిటీ చాలా అవసరం. చిన్న సినిమా అయినా దీనికి బాగా పబ్లిసిటీ చేసి అధిక థియేటర్స్ లో విడుదల చెయ్యాలని కోరుకుంటున్నాను. రాజ్ కిరణ్ సంగీతం శేఖర్ కెమెరావర్క్ సినిమాకు ఆదనవు ఆకర్షణ కానున్నాయి. అందరి సపోర్ట్ తో పెద్ద స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ మోహన్ రావ్ మాట్లాడుతూ.. సిటీలో జరుగుతున్న వరుస హత్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అత్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో జయసింహ, హీరోయిన్ అక్ష పాత్రలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ మూవీని నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించబోతున్నారని తెలిపారు.
నిర్మాత శెట్టి చిరంజీవి మాట్లాడుతూ... డైరెక్టర్ మోహన్ రావు గారు చెప్పిన పాయింట్ బాగుంది. సినిమాను త్వరలో స్టార్ట్ చెయ్యబోతున్నాము. మా సినిమాకు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
హీరోయిన్ అక్ష మాట్లాడుతూ.. నాకు ఈ పాత్ర బాగా నచ్చింది, డైరెక్టర్ గారు బాగా తీస్తారని నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ అఖిల సినిమాతో నాకు మంచి పేరు లభిస్తుందని భావిస్తున్నాను అన్నారు.
హీరో జయసింహ మాట్లాడుతూ... అఖిల స్టోరీ వినగానే బాగా నచ్చేసింది. కన్నడలో నేను సినిమా తరువాత తెలుగులో ఫస్ట్ టైమ్ ఈ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. అక్ష హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో అందరికి పరిచయం ఉన్న సీనియర్ నటీనటులు నటించబోతున్నారని తెలిపారు.
నటీనటులు:
అక్ష, జయ సింహ
సాంకేతిక నిపుణులు:
నిర్మాత: శెట్టి చిరంజీవి
దర్శకత్వం: మోహన్ రావ్.ఎస్
సహాయ దర్శకత్వం: రవివర్మ ఆకుల
రచయిత: శ్రీకాంత్ నాని
సంగీతం: రాజ్ కిరణ్
కెమెరామెన్: శేఖర్
ఫైట్స్: నందు, రవికాంత్
డాన్స్: కిరణ్, జె.వి.ఎస్