Advertisementt

‘మిస్సింగ్’ ఫిల్మ్‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Thu 10th Sep 2020 10:35 AM
missing movie,first look,anil ravipui,harsha narra  ‘మిస్సింగ్’ ఫిల్మ్‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
Missing Movie First Look Released ‘మిస్సింగ్’ ఫిల్మ్‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడి చేతుల మీదుగా బ‌జ‌రంగ‌బ‌లి క్రియేష‌న్స్ ‘మిస్సింగ్’ ఫిల్మ్‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

బజరంగబలి క్రియేష‌న్స్ ప‌తాకంపై శ్రీ‌ని జోశ్యుల ద‌ర్శ‌క‌త్వంలో భాస్క‌ర్ జోశ్యుల‌, శేష‌గిరిరావు న‌ర్రా సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్సింగ్‌’. ‘సెర్చ్‌ వ‌ర్సెస్ రివెంజ్’ అనేది ఉప శీర్షిక‌. హ‌ర్ష న‌ర్రా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. బుధ‌వారం హీరో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఆవిష్క‌రించారు. పోస్ట‌ర్‌లో హీరో ఇంటెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. హీరో వెనుక హుడీ ధ‌రించిన వ్య‌క్తి షాడో క‌నిపిస్తోంది. పోస్ట‌ర్‌పై ‘జూలై 13 శ‌నివారం రాత్రి 11:30 గంట‌ల స‌మ‌యంలో శ్రుతి మిస్స‌య్యింది’ అంటూ రాయ‌డాన్ని బ‌ట్టి క‌థ‌కు కీల‌కాంశం అదేన‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇందులో హీరో పేరు గౌత‌మ్‌. శ్రుతి కోసం గౌత‌మ్ చేసిన అన్వేష‌ణ ఫ‌లించిందా, లేదా అనే ఆస‌క్తిక‌ర క‌థ‌నంతో సినిమా థ్రిల్స్‌ను అందిస్తుంద‌ని చిత్ర బృందం అంటోంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. థియేట‌ర్లు ఓపెన్ అయ్యాక చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

తారాగ‌ణం:

హ‌ర్ష న‌ర్రా, నికిషా రంగ్‌వాలా, మిషా నారంగ్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, రామ్ ద‌త్‌

సాంకేతిక బృందం:

పాటలు: వశిష్టశర్మ, కిట్టు విస్సాప్రగడ, శ్రీని జోశ్యుల

సంగీతం: అజయ్ అరసాడ

సినిమాటోగ్రఫీ: జనా

ఎడిటర్: సత్య జి.

పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలె

పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయ్‌ కె కిరణ్ M.F.TECH

నిర్మాతలు: భాస్కర్ జోశ్యుల, శేషగిరిరావు నర్రా

కథ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, దర్శకత్వం: శ్రీని జోశ్యుల M.F.TECH

Missing Movie First Look Released:

Anil Ravipudi Launches Missing Movie First Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ