Advertisementt

అఖిల్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రకటించారోచ్!

Wed 09th Sep 2020 11:44 PM
akhil akkineni,surender reddy,anil sunkara,crazy project,ramabrahmam sunkara  అఖిల్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రకటించారోచ్!
Akhil 5th Film Details Out అఖిల్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రకటించారోచ్!
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని - సురేందర్ రెడ్డి - అనిల్ సుంకరల కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్.

ఎదురుచూస్తున్న బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు.

యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ‘‘ఇట్స్ టైమ్‌! సురేంద‌ర్ రెడ్డి, అనీల్‌సుంక‌రగారితో నా సినిమా అనౌన్స్ చేయ‌డం హ్యాపీగా ఉంది. ఇది నాకు ఎక్స్‌ట్రీమ్‌లి స్పెష‌ల్ మూవీ. పూర్తి ఉత్సాహంతో త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు.

స్టార్ డైరెక్టర్ సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అఖిల్ అక్కినేనితో నా సినిమా ప్ర‌క‌టించ‌డం హ్యాపీగా ఉంది. మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు.

నిర్మాత అనీల్ సుంక‌ర మాట్లాడుతూ.. ‘‘బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని రూపొందించ‌డానికి చాలా ఉత్సాహంగా, ఆస‌క్తిగా ఉన్నాం. ఈ కాంబినేష‌న్ అంద‌రి అంచ‌నాల‌ను మించి పోయేలా ఉంటుంది. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. 

తన చిత్రాల్లో హీరోలను అత్యంత స్టైలిష్ గా ప్రజెంట్ చేసే దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని 5వ చిత్రంలో అఖిల్ ని సరికొత్తగా ఆవిష్కరించనున్నారు. 2020 సంవత్సరాన్ని సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో ప్రారంభించిన ఏకే ఎంటర్టెన్మెంట్స్ బిగ్ స్కేల్ లో నిర్మించనున్న అఖిల్ 5 తో తన విజయపరంపరను కొనసాగించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

హీరో: అఖిల్ అక్కినేని,

దర్శకత్వం: సురేందర్ రెడ్డి,

నిర్మాత: రామబ్రహ్మం సుంకర,

కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి.

Akhil 5th Film Details Out:

Akhil Akkineni, Surender Reddy, Anil Sunkara’s Crazy Project Announced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ