కోమారి జానకిరామ్ దర్శకత్వంలో కోమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం యొక్క ‘తోలుబొమ్మల సిత్రాలు’ బ్యానర్ వీడియో మరియు లోగోను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్.బి. అంజద్ భాషా తాజాగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బ్యానర్ లోగో ఆవిష్కరించిన అంజద్ భాషా మాట్లాడుతూ.. సినిమా పుట్టుకకి బీజమైన తోలుబొమ్మలాట కళని తోలుబొమ్మల సిత్రాలు అని బ్యానర్‌గా నిర్మించినందుకు అభినందిస్తూ ఈ బ్యానర్ తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సంస్థగా ఎదగాలని ఈ బ్యానర్‌లో మరిన్ని మంచి చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నానని తెలిపారు.
దర్శకులు కోమారి జానకిరామ్ మాట్లాడుతూ.. మా తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ లోగో మరియు వీడియా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిత్ర కథాంశంను తెలుసుకొని ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని వారు తెలుపడం సంతోషం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్‌ను ఇతర విషయాలను త్వరలో తెలుపుతానని అన్నారు.
ఈ చిత్రానికి కెమెరామెన్: డి.యాదగిరి, ఎడిటింగ్: సునీల్ మహారణ, సంగీతం: యు.వి.నిరంజన్, నిర్మాత: కోమారి జానయ్య నాయుడు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కోమారి జానకిరామ్.