Advertisementt

నాగశౌర్య సినిమాలో జగపతిబాబు..!

Fri 04th Sep 2020 10:02 PM
naga shourya,ns20 film,jagapathi babu,latest update,naga shourya movie  నాగశౌర్య సినిమాలో జగపతిబాబు..!
Jagapathi Babu Key Role in Naga Shourya NS20 Film నాగశౌర్య సినిమాలో జగపతిబాబు..!
Advertisement
Ads by CJ

యంగ్‌ హీరో నాగశౌర్య NS20లో కీల‌క‌పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు. సెప్టెంబ‌ర్ 18 నుండి షూటింగ్‌

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి ప‌తాకాల‌పై #NS20ను ప్ర‌ముఖ నిర్మాత‌లు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిక్స్ ప్యాక్ బాడీతో చేతిలో బాణం ప‌ట్టుకుని వారియ‌ర్ పోజ్‌లో నాగ‌శౌర్య నిల్చొని ఉన్న స్ట‌న్నింగ్‌ ఫస్ట్‌లుక్ అంద‌రినీ థ్రిల్ చేసింది. స‌రికొత్త‌గా క‌నిపిస్తోన్న నాగ‌శౌర్య లుక్ సూప‌ర్బ్ అని అంద‌రూ అప్రి‌షియేట్ చేశారు. ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు.

ప్ర‌భుత్వ నిబంధనల ప్ర‌కారం అన్ని జాగ్ర‌త‌లు తీసుకుంటూ సెప్టెంబ‌ర్ 18 నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై నాన్ స్టాప్‌గా జరుగుతుందని నిర్మాత‌లు తెలిపారు. ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో నాగ‌శౌర్య విలుకాడుగా క‌నిపించ‌నున్నారు.

యంగ్ హీరో నాగశౌర్య, కేతిక‌శ‌ర్మ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: రామ్‌రెడ్డి, సంగీతం: కాల‌బైర‌వ‌, ఎడిట‌ర్‌: జునైద్‌, నిర్మాత‌లు: నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్, కథ, స్క్రీన్‌‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ జాగర్లపూడి.

Jagapathi Babu Key Role in Naga Shourya NS20 Film:

Naga Shourya NS20 Film Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ