Advertisementt

‘ఉప్పెన’.. పవన్ బర్త్‌డే స్పెషల్ ఇదే..!

Thu 03rd Sep 2020 05:59 PM
uppena,new poster,pawan kalyan,birthday  ‘ఉప్పెన’.. పవన్ బర్త్‌డే స్పెషల్ ఇదే..!
Uppena Movie Pawan Kalyan Birthday Special ‘ఉప్పెన’.. పవన్ బర్త్‌డే స్పెషల్ ఇదే..!
Advertisement
Ads by CJ

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘ఉప్పెన’ చిత్రం న్యూ పోస్ట‌ర్‌ విడుద‌ల‌

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘ఉప్పెన‌’. విజ‌య్ సేతుప‌తి ఒక కీల‌క పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. బుధ‌వారం (సెప్టెంబ‌ర్ 2) ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ‘ఉప్పెన’ చిత్ర బృందం హీరో వైష్ణ‌వ్ తేజ్ న్యూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో వైష్ణ‌వ్ తేజ్ చాలా హ్యాపీ మూడ్‌లో క‌నిపిస్తున్నారు. క‌ల‌ర్‌ఫుల్ ష‌ర్ట్ ధ‌రించి కాల‌ర్‌ను నోటితో ప‌ట్టుకొని, న‌డుంపై చేయిపెట్టి సూప‌ర్ హ్యాండ్స‌మ్‌గా ఉన్నారు వైష్ణ‌వ్ తేజ్‌. హీరోయిన్‌ను చూస్తున్న ఆనందం ఆయ‌న ముఖంలో క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే ఈ చిత్రంలోని పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ బాణీలు అందించిన పాట‌లు శ్రోత‌ల‌ను అమితంగా అలరిస్తున్నాయి. ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ అనే రొమాంటిక్ సాంగ్‌ ఇప్ప‌టికే 100 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి, అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. పాట‌లు ‘ఉప్పెన’ చిత్రంపై అంచ‌నాల‌ను పెంచాయి. సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డి, థియేట‌ర్లు తెరుచుకోగానే చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్న‌ద్ధంగా ఉన్నారు. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు ‘ఉప్పెన‌’కు క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను బుచ్చిబాబు అందించారు.

తారాగ‌ణం:

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ

సాంకేతిక బృందం:

మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌

సినిమాటోగ్ర‌ఫీ:  షామ్‌ద‌త్ సైనుద్దీన్‌

ఎడిటింగ్‌: న‌వీన్ నూలి

ఆర్ట్‌: మౌనికా రామ‌కృష్ణ‌

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌, మ‌ధు మ‌డూరి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అనిల్ వై, అశోక్ బి.

సీఈవో: చెర్రీ

నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా

బ్యాన‌ర్స్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌

Uppena Movie Pawan Kalyan Birthday Special :

Uppena Movie New poster released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ