పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ విడుదల
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకుడు. పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఒక వైపు మహాత్మాగాంధీ ఫొటో, మరో వైపు అంబేద్కర్ ఫొటో మధ్య పవన్ లాయర్ కోటు వేసుకుని నిలబడ్డారు. ఓ చేతిలో బేస్‌బాల్ స్టిక్, మరో చేతిలో క్రిమినల్ లా అనే పుస్తకం పట్టుకుని పవన్ ఠీవిగా నిలబడి ఉన్నలుక్‌తో ఉండేలా మోషన్ పోస్టర్ ప్రేక్షకాభిమానుల అంచనాలను మించేలా ఉంది. ఈ మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో సత్యమేవ జయతే ... అనే బీట్ వినిపిస్తుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌గారి పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుకునేలా ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో పవన్‌కళ్యాణ్ గారు కనిపించబోతున్నారు. కరోనా వైరస్ పరిస్థితులు కాస్త చక్కబడ్డ తర్వాత మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డైలాగ్స్: తిరు, యాక్షన్ రవివర్మ, వి.ఎఫ్.ఎక్స్: యుగంధర్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి, సమర్పణ: బోనీ కపూర్, నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్, దర్శకత్వం: శ్రీరామ్ వేణు.