Advertisementt

‘మగువ’ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్!

Mon 31st Aug 2020 09:44 PM
maguva movie,trailer response,maguva,sriram yedoti  ‘మగువ’ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్!
Tremendous Response to Maguva Movie trailer ‘మగువ’ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్!
Advertisement
Ads by CJ

యూనివర్సల్ డ్రీమ్స్ బ్యానర్‌లో నిర్మించిన సినిమా ‘మగువ’. డిజిటల్ వరల్డ్‌లో ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. డబ్బింగ్ సినిమాలను కూడా ఓటిటిలలో ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. ఇక థ్రిల్లర్ వంటి సినిమాలకు హై డిమాండ్ ఏర్పడుతోంది. అలాంటి రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్ ‘మగువ’ త్వరలో విడుదల కాబోతోంది. సురేష్ బాబు, మధు ప్రియ, ప్రసన్న పుష్పమాల, హరీష్ చంద్ర, నవికేత్ పాటిల్, దేవలరాజు రవి వంటి నటీనటులు నటించిన చిత్రం ‘మగువ’. ఇటీవల శ్రేయాస్ ఈటీలో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోందని చిత్రయూనిట్ తెలుపుతుంది.

యూనివర్సల్ డ్రీమ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీరామ్ యేదోటి దర్శకుడు. సంగీతం సాబు వర్గీస్ అందించాడు. ఈ రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్‌లో ఒక సాఫ్ట్‌వేర్ అమ్మాయి నైట్ డ్యూటీకి వెళుతుండగా కొందరు రేపిస్టులు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఉండే ఒక బిల్డింగ్‌కు తీసుకొని వెళ్లి రేప్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ అమ్మాయి అక్కడ నుండి తెల్లారేసరికి ప్రాణాలతో బయట పడుతుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? కిడ్నాపర్స్‌తో నైట్ అంతా ఆ అమ్మాయి ఏం చేసింది? అసలు కిడ్నాపర్స్ ఏం అయ్యారు? అనేది ఈ మగువ సినిమాలో అసలు పాయింట్. ఈ సినిమాలో థ్రిల్లింగ్ గా ఉండే అంశాలు చాలా ఉన్నాయి. మంచి స్క్రీన్‌ప్లే‌తో చివరి వరకు కథ ఉత్కంఠభరితంగా జరుగుతుంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీరామ్ యేదోటి మాట్లాడుతూ.. మగువ సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇది ప్రతి ఒక్క అమ్మాయి చూడదగ్గ చిత్రం. రిలీజ్ టీజర్ త్వరలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. సురేష్ బాబు, మధు ప్రియ, ప్రసన్న పుష్పమాల,హరీష్ చంద్ర, నవికేత్ పాటిల్, దేవలరాజు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: యూనివర్సల్ డ్రీమ్స్

నిర్మాతలు: పి.వెంకటేష్, కె.గణేష్, రాఘవరాజు రెడ్డయ్య, కె.సుబ్రమణ్యం.

సంగీతం: సాబు వర్గీస్

డిఓపి: ఎమ్.ఎన్.బాల

పిఆర్వో: మధు. విఆర్

రచన, దర్శకత్వం: శ్రీరామ్ యేదోటి

Tremendous Response to Maguva Movie trailer:

Maguva Movie trailer released 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ