Advertisementt

‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ దర్శకుడితో మరోసారి సుధీర్!

Sun 30th Aug 2020 05:15 PM
sudigali sudheer,rajasekhar reddy,pulicharla,anjan babu,movie opening  ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ దర్శకుడితో మరోసారి సుధీర్!
Sudigali Sudheer New Movie in Sambhasiva Art creations ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ దర్శకుడితో మరోసారి సుధీర్!
Advertisement
Ads by CJ

సుడిగాలి సుధీర్ హీరోగా సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ చిత్రం ప్రారంభం

‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా తన సత్తా చాటిన యంగ్ హీరో సుధీర్ హీరోగా.. సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కబోయే చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో సుధీర్‌ని హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అంజన్ బాబు నిమ్మల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి ప్రారంభం కాబోతోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ.. ‘‘మా హీరో సుధీర్, నా కాంబినేషన్‌లో రాబోతోన్న రెండో సినిమా ఇది. ప్రేక్షకులకు కనువిందు చేసే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. సప్తగిరిగారు ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. చక్కటి సంగీతం, యూత్‌ని ఆకట్టుకునే పాటలు, అదిరిపోయే కామెడీ పంచ్‌లు హైలెట్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అన్ని కమర్షియల్ హంగులతో, సీనియర్ నటీనటులందరి కలయికతో.. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి ప్రారంభం కానుంది. మా నిర్మాత అంజన్ బాబు నిమ్మల ఖర్చుకు వెనకాడకుండా మంచి మంచి లొకేషన్స్‌లో చిత్రాన్ని రూపొందించడానికి సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..’’ అని తెలిపారు.

సుడిగాలి సుధీర్, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, ఝాన్సీ, రాజ్‌బాల తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: రాజ్ తోట, పిఆర్వో: బి. వీరబాబు, నిర్మాత: అంజన్ బాబు నిమ్మల, దర్శకత్వం: రాజశేఖర్ రెడ్డి పులిచర్ల. 

Sudigali Sudheer New Movie in Sambhasiva Art creations:

Sudigali Sudheer new movie Launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ