Advertisementt

శ్రేయాస్ ఈటీలో విడుదల కాబోతోన్న ‘బ్లూ ఐస్’!

Fri 28th Aug 2020 08:15 PM
blue eyes,release date,shreyas et,madala ramakrishna,producer  శ్రేయాస్ ఈటీలో విడుదల కాబోతోన్న ‘బ్లూ ఐస్’!
Blue Eyes Movie Release Date Fixed శ్రేయాస్ ఈటీలో విడుదల కాబోతోన్న ‘బ్లూ ఐస్’!
Advertisement
Ads by CJ

‘బ్లూ ఐస్’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.. ఈ నెల 29న శ్రేయాస్ ఈటీలో విడుదల: నిర్మాత మాదాల రామకృష్ణ 

రాధా మాదవి ప్రొడక్షన్స్, రవళి చౌదరి సమర్పణలో మాదాల రామకృష్ణ నిర్మించిన చిత్రం ‘బ్లూ ఐస్’. ఈ సినిమాకి రాజేష్ మూర్తి దర్శకుడు. సంగీతం ఎమ్.అనిరుధ్ అందించాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో  ఆఫ్రీన్ సిద్ధు, నాస్టియా రాయ్, నిశాంత్ వాలియా, ఆర్జే పృథ్వీ ప్రముఖ పాత్రలలో నటించారు. ఈ థ్రిల్లర్‌లో స్నేహితురాలు మర్మమైన పరిస్థితులలో చనిపోయినట్లు తెలుసుకున్న రోహిత్ హంతకుడిని తెలుసుకోవడానికి మోనికా సహాయం తీసుకుంటాడు. ఆమె, ఒక మనోరోగ వైద్యుడితో కలిసి, దారుణ హత్య రహస్యాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఇదే సినిమాలో అసలు పాయింట్. సినిమాలో థ్రిల్లింగ్‌గా అనిపించే అంశాలు చాలానే ఉన్నాయి. ఇదివరకే రిలీజైన బ్లూ ఐస్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోందని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్ని శ్రేయాస్ ఈటీలో ఈ నెల 29న విడుదల చేయబోతోన్నట్లుగా నిర్మాత ప్రకటించారు.

ఈ సందర్భంగా నిర్మాత మాదాల రామకృష్ణ మాట్లాడుతూ.. బ్లూ ఐస్ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. ఈనెల 29న శ్రేయాస్ ఈటీలో మా చిత్రం విడుదల కాబోతోంది. శ్రేయాస్ యాప్‌లో మా సినిమా చూడ్డానికి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, రోజుకు 150 నుండి 200 మంది బుక్ చేసుకుంటున్నారు. మరో కొత్త ట్రైలర్‌ను విడుదల చెయ్యబోతున్నాము.. అని తెలిపారు.

ఆఫ్రిన్ సిద్దు, నాస్తియా రాయ్, నిశాంత్ వాలియ, ఆర్జె పృద్వి తదితరులు నటించిన ఈ చిత్రానికి

టెక్నీషియన్స్:

బ్యానర్: రాధా మాధవి ప్రొడక్షన్స్

నిర్మాత: మాదాల రామకృష్ణ

సంగీతం: ఎమ్.అనిరుద్

దర్శకత్వం: రాజేష్ మూర్తి

పిఆర్వో: మధు.విఆర్

Blue Eyes Movie Release Date Fixed:

Blue Eyes Movie Release in Shreyas ET

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ