Advertisementt

‘అవ‌లంబిక‌’ ట్రైల‌ర్‌ వదిలిన నాగబాబు

Mon 24th Aug 2020 08:30 PM
avalambika movie,nagababu,avalambika movie trailer,srinivas goud,rajasekhar  ‘అవ‌లంబిక‌’ ట్రైల‌ర్‌ వదిలిన నాగబాబు
Avalambika Movie Trailer Released ‘అవ‌లంబిక‌’ ట్రైల‌ర్‌ వదిలిన నాగబాబు
Advertisement
Ads by CJ

శ్రీ షిరిడీ సాయి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై జి. శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘అవ‌లంబిక’‌. ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ (రాజ్‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుజ‌య్‌, అర్చ‌న‌, మంజూష‌, కృతిక‌, కృష్ణ చైత‌న్య‌, లావ‌ణ్య‌, కేశ‌వ్‌, సి.హెచ్‌.నాగేంద్ర‌, వై.వి.రావు త‌దిత‌రులు నటించిన ఈ చిత్ర ట్రైల‌ర్‌ని మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు విడుదల చేశారు.

ఈ సందర్భంగా నాగ‌బాబు మాట్లాడుతూ.. అవ‌లంబిక మూవీ ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం జ‌రిగింది. ట్రైలర్ చాలా బాగుంది. ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ చాలా క‌ష్ట‌ప‌డి ఈ సినిమాని చేశాడు. అత‌నికి ఇది రెండ‌వ సినిమా. యంగ్ టాలెంటెడ్స్‌ని ఎంక‌రేజ్ చేయ‌డంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుంది. హీరో సుజ‌య్ చాలా బాగా చేశాడు. హీరోయిన్ అర్చ‌నని మేము వేద అంటాము. త‌ను చాలా సినిమాల్లో నా కాంబినేష‌న్‌లో కూడా చేసింది. ఈ సినిమాలో త‌ను ఒక కొత్త ర‌క‌మైన పెర్ఫార్మెన్స్‌ని ప్ర‌ద‌ర్శించింది. ప్రొడ్యూస‌ర్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాని మంచి బ‌డ్జెట్‌తో నిర్మించారు. డి.ఓ.పి వెంకీ చాలా బాగా చిత్రీక‌రించారు. ఈ సంద‌ర్భంగా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

అనంతరం ద‌ర్శకుడు రాజ‌శేఖ‌ర్ రాజ్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి‌గారి బ‌ర్త్‌డే రోజు నా సినిమా అవ‌లంబిక ట్రైల‌ర్‌ని మెగా బ్ర‌ద‌ర్ శ్రీ నాగ‌బాబుగారి చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని చాలా క‌ష్ట‌ప‌డి భారీ గ్రాఫిక్స్‌తో చిత్రీక‌రించాం. అంద‌రూ నా సినిమాని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో సుజ‌య్ మాట్లాడుతూ.. కొత్త‌గా ఇండ‌స్ర్టీకి వ‌చ్చే వాళ్ళ‌ని మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఎంక‌రేజ్ చేస్తుంది. మ‌మ్మ‌ల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ అన్నారు.

ప్రొడ్యూస‌ర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముందుగా మ‌మ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేస్తున్న మెగా ఫ్యామిలీకి అన్న‌గారు నాగేంద్ర బాబుగారికి నా ధ‌న్య‌వాదాలు. ఈ సినిమాను భారీ గ్రాఫిక్స్‌తో ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా నిర్మించాము. అంద‌రూ మా సినిమాని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ఈ చిత్రంలో సుజ‌య్‌, అర్చ‌న‌, మంజూష‌, కృతిక‌, కృష్ణ చైత‌న్య‌, లావ‌ణ్య‌, కేశ‌వ్‌, సి.హెచ్‌.నాగేంద్ర‌, వై.వి.రావు త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి డి.ఓ.పి: వెంకీ పెద్దాడ‌, సంగీతం: ఉద‌య్ కిర‌ణ్‌, ఎడిటింగ్: శ్రీ చందు, వి.ఎఫ్‌.ఎక్స్‌: శ్రీ చందు, రూప్‌కుమార్ పాకం, స్టంట్: వై.ర‌వి, ఆర్ట్: ర‌వి.డి, కొరియోగ్ర‌ఫీ: రూప్ కుమార్ పాకం, రవినాయ‌క్‌, ఇర్ఫాన్‌, డి.ఐ: డిజిపోస్ట్‌.

Avalambika Movie Trailer Released:

Nagababu Launches Avalambika Movie Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ