Advertisementt

‘కళాపోషకులు’ చిత్ర మోషన్ పోస్టర్ విడుదల

Sun 23rd Aug 2020 09:52 PM
kalaposhakulu movie,latest update,motion poster,vinayaka chavithi  ‘కళాపోషకులు’ చిత్ర మోషన్ పోస్టర్ విడుదల
Kalaposhakulu Motion Poster released ‘కళాపోషకులు’ చిత్ర మోషన్ పోస్టర్ విడుదల
Advertisement
Ads by CJ

వినాయక చవితి సందర్భంగా ‘కళాపోషకులు’ చిత్ర మోషన్ పోస్టర్ విడుదల

శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కబోతున్న సినిమా కళాపోషకులు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం విశేషం. 

ఈ సందర్భంగా నిర్మాత ఏమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కళాపోషకులు’ చిత్రాన్ని దర్శకుడు చలపతి పువ్వుల బాగా తెరకెక్కించాడు. మహావీర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతొంది. నటీనటులు అందరూ బాగా చేశారు. త్వరలో ఈ సినిమాకు సంభందించిన మరిన్ని విషయాలు తెలియజేస్తాము.. అన్నారు.

డైరెక్టర్ చలపతి పువ్వుల మాట్లాడుతూ.. నిర్మాత సుధాకర్ రెడ్డిగారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. హీరో విశ్వ కార్తికేయ బాగా చేశాడు, సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. కల్యాణ్ సమి కెమెరా వర్క్, ఎలెందర్ మహావీర్ మ్యూజిక్ సినిమాకు అదనవు ఆకర్షణ కానున్నాయని తెలిపారు.

బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్

నటీనటులు: విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, చైతన్య, చిన్ను, సంతోష్, మహేష్ తదితరులు

కెమెరామెన్: కళ్యాణ్ సమి

ఎడిటర్: సెల్వ కుమార్

సంగీతం: ఎలేందర్ మహావీర్

డిజైన్: గణేష్

పీఆర్ఓ: సాయి సతీష్

నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎమ్

స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: చలపతి పువ్వుల

Click Here For Motion Poster

 

Kalaposhakulu Motion Poster released:

Kalaposhakulu Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ