Advertisementt

‘ఈ కథలో పాత్రలు కల్పితం’ మోషన్ పోస్టర్ విడుదల

Sun 23rd Aug 2020 03:11 PM
ee kathalo pathralu kalpitham,motion poster,pavan tej konidela  ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ మోషన్ పోస్టర్ విడుదల
Ee kathalo Pathralu Kalpitham Motion Poster Released ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ మోషన్ పోస్టర్ విడుదల
Advertisement
Ads by CJ

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌‌పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన, ల‌క్కి హీరోయిన్స్‌. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. షూటింగ్ పూర్తి చేరుకున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్ యూనిట్.

ఈ సందర్భంగా నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఈ కథలో పాత్రలు కల్పితం చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ నుండి మంచి సపోర్ట్ లభిస్తోంది. ఇప్పటివరకు చిత్రీకరించిన వరకు ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుండి మా సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుంది. మా దర్శకుడు అభిరామ్ మంచి విజన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘జెస్సీ’, రీసెంట్‌గా వచ్చిన ఓ పిట్టకథ.. సినిమాలకి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్‌ సునీల్‌ కుమార్‌ విజువల్స్‌, ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘కల్కి’ చిత్రాలకు డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్‌ మాటలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలవనున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపి విడుదల తేదీని ప్రకటిస్తాం. త్వరలోనే టీజర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. లేటెస్ట్‌గా విడుదలైన థీమ్ పోస్టర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది  అన్నారు.

డైరెక్టర్ అభిరామ్‌ ఎం మాట్లాడుతూ.. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. హీరో పవన్ తేజ్ కొణిదెలకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతోంది. కథ, కథనాలు ఈ వినిమాకు బాగా కుదిరాయి. కార్తిక్ కొనకండ్ల అందించిన సంగీతం బాగుంటుంది. నిర్మాత రాజేష్ నాయుడుగారు సినిమాను రిచ్ గా అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

నటీనటులు:

పవన్‌ తేజ్‌, మేఘన, ల‌క్కి

సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌.ఎన్‌

సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌ ఆర్‌, ఫైట్స్‌: షావోలిన్‌ మల్లేష్‌, ఆర్ట్‌: నరేష్‌ బాబు తిమ్మిరి,మాటలు: తాజుద్దీన్‌ సయ్యద్‌

కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సియ డిజైన‌ర్స్‌,  కో-డైరెక్టర్‌: కె. శ్రీనివాస్‌ రెడ్డి

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ పామర్తి

లైన్‌ ప్రొడ్యూసర్‌: దుర్గా అనీల్‌ రెడ్డి

నిర్మాత: రాజేష్‌ నాయుడు, రచన, దర్శకత్వం: అభిరామ్‌ ఎం.

Click Here for Motion Poster

Ee kathalo Pathralu Kalpitham Motion Poster Released:

Ee kathalo Pathralu Kalpitham Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ