Advertisementt

సంప‌త్‌నంది క‌థ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో చిత్రం!

Tue 18th Aug 2020 09:53 AM
kk radhamohan,new film,ashok tej,sampath nandi  సంప‌త్‌నంది క‌థ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో చిత్రం!
K.K. Radhamohan New Film With Sampath Nandi Story, Screenplay and Dialogues సంప‌త్‌నంది క‌థ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో చిత్రం!
Advertisement
Ads by CJ

సంప‌త్‌నంది క‌థ స్క్రీన్ ప్లే డైలాగ్స్‌తో కె.కె.రాధామోహ‌న్ కొత్త చిత్రం.

ఏమైంది ఈవేళ‌, బెంగాల్ టైగ‌ర్ వంటి సూప‌ర్‌హిట్స్ అందించిన శ్రీ‌స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహ‌న్ ప్రొడ‌క్ష‌న్ నెం.9గా ఒక డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీని సోమవారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంబించారు. ఈ చిత్రం గురించి నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ.. ‘‘మా బ్యాన‌ర్‌లో ఏమైంది ఈవేళ‌, బెంగాల్‌టైగ‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అందించిన ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా అనిపించింది. క‌థ బాగా న‌చ్చ‌డంతో ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌డం జ‌రిగింది. సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్‌ వీక్ నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జ‌రుగుతుంది. సంప‌త్‌నంది అసోసియేట్ డైరెక్ట‌ర్ అశోక్ తేజ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌ముఖ న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతుంది. అనూప్ క్రియేటివ్స్ సంగీతం అందిస్తున్నారు. మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం అని అన్నారు.  

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: ప‌్ర‌వీణ్ అనుమోలు,

సంగీతం: అనూప్ క్రియేటివ్స్‌‌,

స‌మ‌ర్ప‌ణ: శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్‌,

నిర్మాత‌:  కె.కె. రాధామోహ‌న్‌,

క‌థ, స్క్రీన్ ప్లే, మాట‌లు: స‌ంప‌త్‌నంది,

ద‌ర్శ‌క‌త్వం: అశోక్ తేజ.

K.K. Radhamohan New Film With Sampath Nandi Story, Screenplay and Dialogues:

K.K. Radhamohan Announced New Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ