గోపీచంద్, నిఖిల్, కోన వెంకట్, బాబీ విడుదల చేసిన ‘విద్యార్థి’ ఫస్ట్ లుక్
‘రాజుగారి గది’ ఫేమ్ చేతన్ చేన్, టిక్‌టాక్ ఫేమ్ బన్నీ వాక్స్ (వర్షిణి) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘విద్యార్థి’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరోలు గోపీచంద్, నిఖిల్, రచయిత-నిర్మాత కోన వెంకట్, డైరెక్టర్ బాబీ ఆవిష్కరించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ వివిధ భావోద్వేగాలు ప్రదర్శిస్తున్న హీరోతో ఉత్తేజభరితంగా కనిపిస్తోంది. ‘ఎ లోన్ ఫైట్ ఫర్ లవ్’ (A Lone Fight For Love) అనేది ట్యాగ్‌లైన్.
రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. గుంటూరు, రాజమండ్రి, వైజాగ్, అరకు వంటి లొకేషన్లలో 42 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ జరిపారు. ‘విద్యార్థి’ చిత్రంలో 5 పాటలు, 6 ఫైట్లతో పాటు భారీ స్థాయిలో చిత్రీకరించిన కబడ్డీ ఎపిసోడ్ ఉన్నాయి. మహాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజేటి రామకృష్ణ, వంశీ తాడికొండ భాగస్తులుగా ఆళ్ల వెంకట్ (ఏవీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మధు మాదాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దసరా పర్వదినం సందర్భంగా ‘విద్యార్థి’ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
తారాగణం:
చేతన్ చేన్, బన్నీ వాక్స్ (వర్షిణి), రఘుబాబు, మణిచందన, జీవా, టీఎన్ఆర్, నవీన్ నేని, యడం రాజు, నాగమహేష్, పవన్ సురేష్, శరణ్ అడ్డాల.
సాంకేతిక బృందం:
పాటలు: భాస్కరభట్ల, సురేష్ బనిశెట్టి, వాసు వలబోజు
సినిమాటోగ్రఫీ: ఖన్నయ్య సిహెచ్.
ఎడిటింగ్: బి. నాగేశ్వరరెడ్డి
స్టంట్స్: రామకృష్ణ
కొరియోగ్రఫీ: అనేష్
లైన్ ప్రొడ్యూసర్: వంశీ తాడికొండ
సహ నిర్మాత: రామకృష్ణ రాజేటి (ఆర్.ఆర్.కె.)
నిర్మాత: ఆళ్ల వెంకట్ (ఏవీ)
దర్శకత్వం: మధు మాదాసు
బ్యానర్: మహాస్ క్రియేషన్స్