Advertisementt

‘మ్యాడి అనే మాధవ్‌’ ఫస్ట్‌లుక్ విడుదల

Mon 17th Aug 2020 12:04 AM
maddy ane madhav movie,independence day song,pradheesh dipu  ‘మ్యాడి అనే మాధవ్‌’ ఫస్ట్‌లుక్ విడుదల
Maddy ane Madhav Movie Independence Day song released ‘మ్యాడి అనే మాధవ్‌’ ఫస్ట్‌లుక్ విడుదల
Advertisement
Ads by CJ

పాన్‌–ఇండియా ఫిల్మ్‌ ‘మ్యాడి అనే మాధవ్‌’ ఫస్ట్‌లుక్‌, ఇండిపెండెన్స్‌ డే స్పెషల్‌ సాంగ్‌ విడుదల

తెలుగు సహా తమిళం, మలమాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆన్మే క్రియేషన్స్‌ పతాకంపై అనిల్‌కుమార్‌ నిర్మిస్తున్న పాన్‌–ఇండియా ఫిల్మ్‌ ‘మ్యాడి (అనే) మాధవ్‌’. తమిళంలో ‘మ్యాడి ఎంగిర మాధవన్‌’, హిందీలో ‘మేరా ఇండియా’గా విడుదల చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఈ సినిమాలో ‘ముచ్చటైన మువ్వన్నెల జెండా...’ పాటతో పాటు తెలుగు వెర్షన్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. నిర్మాత అనిల్‌కుమార్‌ కథ అందించిన ఈ చిత్రంతో ప్రతీష్‌ దీపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ సందర్భంగా చిత్రరచయిత, నిర్మాత అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘పంద్రాగస్టుకు దేశభక్తి గీతాన్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజే ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేశాం. తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గొప్ప ఆలోచనలు, ధైర్యసాహసాలు కలిగిన నిరుపేద చిన్నారి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే కాన్సెప్ట్‌ కావడంతో పాన్‌–ఇండియన్‌ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నాం. దక్షిణాది భాషలకు, హిందీకి వేర్వేరు నటీనటులను తీసుకున్నాం. చిత్రీకరణ సైతం వేర్వేరుగా చేస్తున్నాం. కొందరు నటీనటులు అన్ని భాషల్లో కనిపిస్తారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన హీరోలు ప్రభు, అదిత్‌ అరుణ్‌, ‘నువ్వే కావాలి’ ఫేమ్‌ రిచా కీలక పాత్రల్లో నటించారు. ‘మాస్టర్‌’ అంజయ్‌ ప్రధాన పాత్ర పోషించాడు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని అన్నారు.

ప్రభు, మాస్టర్‌ అంజయ్‌, రిచా, అదిత్‌ అరుణ్‌, నేహా ఖాన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కె. నాయుడు – ఫణి కందుకూరి, ప్రొడక్షన్‌ మేనేజర్‌: కృష్ణమూర్తి, ఆర్ట్‌ డైరెక్టర్‌: తోట తరణి, స్టంట్స్‌: అన్బు-అరివు, డ్యాన్స్‌: ప్రసన్న, రిచర్డ్‌ బర్టన్‌, డైలాగులు: రాజేష్ మూర్తి - వి. ప్రభాకర్‌, వి.టి. విజయన్‌, గణేష్‌కుమార్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: జోష్వా శ్రీధర్‌, సినిమాటోగ్రఫీ: అజయన్‌ విన్సెంట్‌-ఆకాష్ విన్సెంట్‌, సాహిత్యం: భువచంద్ర, సంగీతం: ఔసెప్పఛన్-హెశం, రచన–నిర్మాణం: అనిల్‌కుమార్‌, దర్శకత్వం: ప్రతీష్‌ దీపు.

Maddy ane Madhav Movie Independence Day song released:

Maddy ane Madhav Movie First Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ