Advertisementt

సాయితేజ్ 15వ చిత్ర ప్రకటన వచ్చేసింది

Sat 15th Aug 2020 08:42 PM
sri venkateswara cine chitra llp,sukumar writings,supreme hero sai tej,karthik dandu  సాయితేజ్ 15వ చిత్ర ప్రకటన వచ్చేసింది
Supreme Hero Sai Tej 15th Film details సాయితేజ్ 15వ చిత్ర ప్రకటన వచ్చేసింది
Advertisement
Ads by CJ

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ కొత్త‌చిత్రం 

కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ క‌థానాయ‌కుడిగా కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించారు. భారీ హిట్ చిత్రాల‌కు కేరాఫ్ అయిన శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, వైవిధ్య‌మైన క‌థాంశాల‌ను ప్రాధాన్య‌మిచ్చే సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్‌ బీవీఎస్ఎన్‌ ప్ర‌సాద్ నిర్మాత‌గా ఈ చిత్రం రూపొంద‌నుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్ట‌ర్‌ను శుక్రవారం విడుద‌ల చేశారు.

ఈ పోస్ట‌ర్‌లో ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహ‌స్ప‌తిః సింహరాశౌ స్థిత న‌మ‌యే, అంతిమ పుష్క‌రే’ అని సంస్కృతంలోని వాక్యంతో పాటు ష‌ట్‌చ‌క్రంలో ఓ క‌న్ను చూపిస్తున్నారు. అస‌లు ఈ క‌న్ను, ష‌ట్‌చ‌క్రం, సంస్కృత వాక్యం వెనకున్న క‌థేంట‌నే అంశాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. మిస్టీక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రచన శాఖ‌లో ప‌నిచేసిన కార్తీక్ దండు తెర‌కెక్కిస్తున్నారు. బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వరలో తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది

Supreme Hero Sai Tej 15th Film details:

Sri Venkateswara Cine Chitra LLP, Sukumar Writings new film with Supreme Hero Sai Tej

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ