Advertisementt

‘రోజూ గిల్లే వాడు’ నుంచి రెండో సాంగ్ రిలీజ్!

Tue 11th Aug 2020 01:06 AM
jonnavithula,roju gille vaadu movie,2nd song,released  ‘రోజూ గిల్లే వాడు’ నుంచి రెండో సాంగ్ రిలీజ్!
Roju Gille Vaadu Movie 2nd song Launched ‘రోజూ గిల్లే వాడు’ నుంచి రెండో సాంగ్ రిలీజ్!
Advertisement
Ads by CJ

కార్తికేయ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం మరియు టారస్ సినీకార్ప్ సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న ‘ఆర్జీవీ’.. ‘రోజూ గిల్లే వాడు’ చిత్రంలోని 2వ గీతం లిరికల్ వీడియోని, ది 09-08-2020 ఆదివారం అర్ధరాత్రి, మణికొండ మర్రిచెట్టు కింద, తెలుగువన్ ఛానల్ చైర్మన్ రవిశంకర్ విడుదల చేయడం జరిగిందని, ఈ సినిమాలోని మొదటి పాట విడుదలై‌న 2 వారాల్లోనే యూట్యూబ్‌లో 20లక్షలమంది పైగా విని ఆనందించారని రచయిత జొన్నవిత్తుల తెలిపారు.

తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన ‌తెలుగు సినీపరిశ్రమనే అవమానిస్తున్న ‘తగుల్భాజీదర్శకదయ్యం’, ‘నమక్ హ రాం’ఘోపాలవర్మకి ఈ‌ రెండో పాటని అంకితం ఇచ్చినట్లు కవి, దర్శకుడు జొన్నవిత్తుల తెలియచేశారు. చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ.. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి విడుదల చేస్తామని తెలిపారు. 

నటీనటవర్గం: సురేష్, రాశి, శ్రద్ధాదాస్, అమిత్, తేజ తదితరులు.

సాంకేతికనిపుణులు:

ఛాయాగ్రహణం: వేదాంత్ మల్లాది

కూర్పు: కార్తీక శ్రీనివాస్

కళ: కృష్ణ చిత్తనూర్

పబ్లిసిటీ: ధనీ ఏలే

పీఆర్వో: మధు మాడూరి

సంగీతం: వీణాపాణి

సమర్పణ: వెంకట శ్రీనివాస్ బొగ్గరం

నిర్మాత: బాల కుటుంబ రావు పొన్నూరి

కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం మరియు దర్శకత్వం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

Roju Gille Vaadu Movie 2nd song Launched:

Jonnavithula Roju Gille Vaadu Movie 2nd song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ