Advertisementt

ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘రెచ్చిపోదాం బ్రదర్’ లిరికల్ సాంగ్

Mon 10th Aug 2020 10:30 PM
rechchi podham brother movie,lyrical song,ak jampanna  ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘రెచ్చిపోదాం బ్రదర్’ లిరికల్ సాంగ్
Rechchi Podham Brother Movie lyrical song released ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘రెచ్చిపోదాం బ్రదర్’ లిరికల్ సాంగ్
Advertisement
Ads by CJ

ప్రచోదయ ఫిల్మ్స్ పతాకం‌పై కిరణ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రదారులుగా ఏ. కె. జంపన్న దర్శకత్వంలో.. వివి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’. అన్ని హంగులతో ముస్తాబైన ఈ చిత్రానికి సాయి కార్తీక్ స్వరాలను అందించారు. కాగా ఈ చిత్ర లిరికల్ సాంగ్‌ను సోమవారం ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఏ. కె. జంపన్న మాట్లాడుతూ.. ‘‘అన్ని కమర్షియల్ హంగులున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. మా చిత్రానికి మెయిన్ హైలైట్ సాయికార్తీక్‌గారు అందించిన సంగీతం. అలాగే ఆయన అందించిన రీ రికార్డింగ్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. అలాగే మా చిత్రంలో హీరో కిరణ్, అతుల్ కులకర్ణి మధ్య సాగే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇటువంటి మంచి చిత్రానికి వర్క్ చేసే అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను..’’ అన్నారు.

చిత్ర నిర్మాత హనీష్ బాబు ఉయ్యూరు మాట్లాడుతూ.. ‘‘నేటి వాస్తవిక పరిస్థితులకు ఎంటర్‌టైన్మెంట్ జోడించి అన్ని కమర్షియల్ హంగులతో రాబోతోన్న హిట్ చిత్రమిది. ఎమోషన్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ సమపాళ్లతో ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే చిత్రమిది. సాయి కార్తీక్ మ్యూజిక్, శ్యామ్ కె నాయుడు కెమెరా పనితనం, భాస్కరభట్ల లిరిక్స్ మా చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మా చిత్ర ఆడియో నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను నేడు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

రవికిరణ్, అతుల్ కులకర్ణి, దీపాలి శర్మ, శివాజీరాజా, పోసాని, శశాంక్, భానుచందర్, ఇంద్రజ, బెనర్జీ, అజయ్‌గోష్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, పూర్ణచారి; డి.ఓ.పి: శ్యాం.కె. నాయుడు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఆర్ట్: మహేష్ శివన్, డాన్సు: భాను, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, పి.ఆర్.ఓ: వీరబాబు, ప్రొడ్యూసర్స్: వివి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరు, స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: ఏ. కె. జంపన్న.

Rechchi Podham Brother Movie lyrical song released :

Rechchi Podham Brother Movie latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ