Advertisementt

షేర్, బాబాల లాక్డౌన్ చిత్ర టీజర్ విడుదల

Fri 07th Aug 2020 07:41 AM
prathani ramakrishna goud,atluri ramakrishna,lockdown teaser,sher,baba  షేర్, బాబాల లాక్డౌన్ చిత్ర టీజర్ విడుదల
Lockdown Movie teaser released షేర్, బాబాల లాక్డౌన్ చిత్ర టీజర్ విడుదల
Advertisement
Ads by CJ

షేర్ ప్రెజెంట్స్, మౌంట్ ఎవరెస్ట్ పిక్చర్స్ లాక్డౌన్ చిత్ర టీజర్ విడుదల

షేర్ ప్రెజెంట్స్ బ్యానర్ లో వస్తోన్న చిత్రం లాక్డౌన్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెరకెక్కుతున్న సినిమా ఇది. లాక్డౌన్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. షేర్ ఈ సినిమాను ప్రెజెంట్స్ చెయ్యడంతో పాటు డైలాగ్స్, సంగీతం, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు, అక్కడితో సినిమా సక్సెస్ అని చెప్పేయొచ్చు. బాబా దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాను మిన్నీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ప్రతాని రామకృష్ణ గౌడ్, అట్లూరి రామకృష్ణ గార్లు విడుదల చేశారు.

ఈ సందర్భంగా షేర్ మాట్లాడుతూ.. లాక్డౌన్ లో జరిగిన అన్ని విషయాలు ఈ సినిమాలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, అమ్మాయిలకు ఈ సినిమా ఒక ధైర్యం ఇస్తుంది, ఒక మంచి మెసేజ్ తో పాటు కామెడీ ఈ సినిమాలో ఉండబోతోంది. జబర్దస్త్ రాకింగ్ రాకేష్, ఈరోజుల్లో సాయి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మెసేజ్ సినిమా ఈ లాక్డౌన్ అని తెలిపారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. షేర్ ఈ లాక్డౌన్ సినిమాను అనుకున్న బడ్జెట్ టైమ్ కి పూర్తి చెయ్యడం విశేషం. టీజర్ ఇంట్రస్టింగ్ గా బాగుంది, సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని కోరుకుంటున్నా అన్నారు. 

అట్లూరి రామకృష్ణ మాట్లాడుతూ.. షేర్‌కు నిర్మాతల పల్స్ బాగా తెలుసు. తాను గతంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. అవి బాగా సక్సెస్ అయ్యాయి. నిర్మాతలకు లాభాలు వచ్చాయి. అలాగే లాక్డౌన్ సినిమా అందరికి నచ్చే విధంగా ఉండబోతోందని అనుకుంటున్నాను. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Click Here for Teaser

నటీనటులు: 

ఉమాంతకల్ప

ఆశి రోయ్

హృతిక సింగ్

రాకింగ్ రాకేష్

బాలాజీ

తేజేందర్ సింగ్

శ్రీకాంత్

బాలు

అపూర్వ

శ్రీ

సాంకేతిక నిపుణులు: 

బ్యానర్: మౌంట్ ఎవరెస్ట్ పిక్చర్స్

సమర్పణ: షేర్ ప్రెజెంట్స్

కెమెరామెన్: ప్రవీణ్ కిషోర్

సంగీతం, స్టొరీ, స్క్రీన్ ప్లే: షేర్

లిరిక్స్: భాష్యశ్రీ

ఎడిటర్: ప్రభు ఈశ్వర్

డిఐ: బాలాజీ

ఆర్ట్: అబిద్ అలీ ఖాన్

డైరెక్టర్:బాబా

ప్రొడ్యూసర్: మిన్న

Lockdown Movie teaser released:

prathani Ramakrishna goud and Atluri Ramakrishna Launches lockdown teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ