Advertisementt

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లుక్ విడుదల

Wed 29th Jul 2020 04:30 PM
romantic look,most eligible bachelor,akhil akkineni,pooja hegde,bommarillu bhaskar,ga2 pictures  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లుక్ విడుదల
Most Eligible Bachelor romantic Look released ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లుక్ విడుదల
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో జిఏ2 పిక్చ‌ర్స్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ రొమాంటిక్ పోస్టర్ విడుదల

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’. టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో రెడీ అవుతున్న ఈ సినిమాకి టాలీవుడ్‌లో వ‌రుస‌గా భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌, పిల్లానువ్వులేని జీవితం, గీతాగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ తో  మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా అనౌన్స్‌ దగ్గర నుంచి అక్కినేని అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే గోపీసుంద‌ర్ సంగీత‌సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజగా ఈ సినిమాకు సంబంధించిన రొమాంటిక్ పోస్టర్‌ని విడుదల చేసింది.

అఖిల్‌ అక్కినేని‌తో రొమాన్స్ చేస్తున్న పూజా హెగ్డే

ఈ రోజు విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ అక్కినేని వర్క్ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి బుట్ట బొమ్మ పూజా హెగ్డే టీజ్ చేసే ఈ స్టిల్ చూస్తే ప్ర‌తి ఒక్క‌రిలో ఒక తెలియ‌ని రొమాంటిక్ ఫీల్ వ‌స్తుంది. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్ తో ల‌వ్ లీగా వుండే కేర‌క్ట‌ర్స్ గా డిజైన్ చేస్తారు. అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఓ స్పెషాలిటి వుంటుంది. అఖిల్ అక్కినేని, పూజాల మ‌ధ్య ఎలాంటి కెమిస్ట్రి ఈ చిత్రంలో వుండ‌బోతుందో ఈ పోస్ట‌ర్ డిజైనింగ్‌లో చాలా చ‌క్క‌గా, అందంగా చూపించారు ద‌ర్శ‌కుడు భాస్క‌ర్‌.

రొమాంటిక్‌ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా మెస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ రెడి అవుతున్నాడు.

ఇప్ప‌టికే 70శాతం షూటింగ్ పూర్త‌య్యి రొమాంటిక్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఒక షెడ్యూల్ మిన‌హ‌ షూటింగ్ మెత్తాన్ని పూర్తిచేసుకుంది. ఈ కరోనా క్రైసిస్ కొంచెం త‌గ్గితే ఈ షెడ్యూల్‌ని కూడా అతిత్వ‌ర‌లో ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ అక్కినేని మ‌రియు పూజాలు షూటింగ్‌కి సిద్దంగా వున్నా బ‌య‌ట‌ ప‌రిస్థితులు దృష్ట్యా నిర్మాతలు బన్నీ వాసు, వాసు వర్మలు ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఇప్పటికే కీలకమైన సన్నివేశాలతో పాటు దాదాపు టాకీ షూటింగ్ పూర్తి అయ్యినట్లుగా నిర్మాతలు తెలిపారు. ఈ లాక్‌డౌన్‌లో గోపీసుంద‌ర్‌తో మ్యూజిక్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేశారు. అలాగే అతి త్వ‌ర‌లో డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్ట‌బోతున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఆమని, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2021లో జ‌న‌వ‌రి పొంగ‌ల్ కి విడుద‌ల చేయటానికి నిర్మాతలు స‌న్నాహ‌లు చేస్తున్నారు.

న‌టీ న‌టులు

అఖిల్ అక్కినేని

పూజా హెగ్ఢే

ఆమ‌ని

ముర‌ళి శ‌ర్మ‌

జ‌య ప్ర‌కాశ్

ప్ర‌గ‌తి

సుడిగాలి సుధీర్

గెటెప్ శ్రీను

అభ‌య్

అమిత్

సాంకేతిక నిపుణులు..

బ్యానర్: జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ: అల్లు అర‌‌వింద్  

మ్యూజిక్: గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ: ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్: మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్: అవినాష్ కొల్లా

పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను  

నిర్మాత‌లు: బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

డైరెక్ట‌ర్: బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

Most Eligible Bachelor romantic Look released:

Romantic look poster of Most Eligible Bachelor Starring Akhil Akkineni, and Pooja Hegde, and directed by  Bommarillu Bhaskar, produced by GA2 Pictures out now

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ