Advertisementt

‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’.. అధీరా లుక్ విడుదల

Wed 29th Jul 2020 04:16 PM
sanjay dutt,birthday special,kgf chapter 2,adheera look  ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’.. అధీరా లుక్ విడుదల
Sanjay Dutt First Look Poster From KGF Chapter 2 released ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’.. అధీరా లుక్ విడుదల
Advertisement
Ads by CJ

అధీరాగా బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’

ఈ మ‌ధ్య కాలంలో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేపిన అంశం.. అధీరా లుక్‌. ఇంత‌కూ అధీర ఎవ‌రు? క‌్రూర‌మైన వ్య‌క్తి. త‌ను అనుకున్నది సాధించే క్ర‌మంలో ఎంత‌టి క్రూర‌త్వానికైనా తెగించే వ్య‌క్తి. అధీరాకు ఏం కావాలి? అంటే .. ‘కె.జి.య‌ఫ్ చాప్టర్2’ చూడాల్సిందేన‌ని అంటున్నారు చిత్ర యూనిట్‌. అధీరా పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్నారు. రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’. బుధ‌వారం సంజ‌య్ ద‌త్ పుట్టిన‌రోజు (జూలై 29). ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’లోని అధీరా లుక్‌ను విడుద‌ల చేసింది

తెల్ల‌టి గ‌డ్డం, మెలితిప్పిన మీసాలు, డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, డ్రెసింగ్, ముఖంపై ప‌చ్చ‌బొట్టు, చేతిలో ప‌దునైన పెద్ద క‌త్తి ప‌ట్టుకుని ఏదో సుధీర్ఘ‌మైన ఆలోచ‌న‌లో ఉన్నట్లుగా లుక్ ఉంది. ఈ లుక్‌ను విడుద‌ల చేసిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ ‘‘హ్యాపీ బర్త్ డే సంజూ బాబా. మా ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’లో భాగమైనందుకు ధన్యవాదాలు. తదుపరి షెడ్యూల్ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నాం’’ అన్నారు.

‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ కన్నడ చిత్రసీమలో ‘కె.జి.యఫ్’ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజైంది. వసూళ్లలోనే కాకుండా అవార్డుల్లోనూ ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్స్ విభాగాల్లో ఈ ఏడాది జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’కి కొనసాగింపుగా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ రూపొందుతోంది. కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో హోంబ‌లే ఫిలింస్ నిర్మ‌స్తోన్న ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చ‌ల‌న చిత్రం విడుద‌ల చేస్తుంది. ఈ చిత్రానికి ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Sanjay Dutt First Look Poster From KGF Chapter 2 released:

Sanjay Dutt Birthday special: First Look Poster From KGF Chapter 2 released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ