శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఆదా శర్మ హీరోయిన్‌గా కొత్త సినిమా ప్రారంభం
శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఆదా శర్మ, సంజయ్, భానుశ్రీ, అభయ్, హరితేజ, అక్షిత శ్రీనివాస్ మరియు అజయ్ ముఖ్య తారాగణంతో విప్రా దర్శకత్వంలో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘానా సమర్పణలో నిర్మించబడుతున్న నూతన చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.
నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై చిత్రం ప్రారంభం అవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ కరోనా టైంలో ఇలాంటి విపత్తు సమయంలో మేము సినిమా ప్రారంభించటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకులని పరిచయం చేయటం చాలా ఆనందంగా ఉంది. ఆదా శర్మ మా చిత్రంలో హీరోయిన్‌గా ముఖ్య పాత్ర చేస్తుంది. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమా. ఈరోజు నుంచే మా చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఏకధాటి షెడ్యూల్‌తో ఈ చిత్రాన్ని పూర్తిచేయాలని అనుకుంటున్నాం. కథ చాలా బాగుంది’’ అని తెలిపారు.
విప్రా దర్శకులు మాట్లాడుతూ.. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం గౌరీ కృష్ణ నిర్మాతగా మా చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఈరోజు నుంచి 10 రోజులు పాటు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుని తర్వాత నిర్మల్ లో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం.. అని తెలిపారు.
హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ.. నా గత చిత్రాలు హార్ట్ ఎటాక్, క్షణం నాకు మంచి పేరు తెచ్చాయి. ప్రేక్షకులు నానుంచి మంచి సినిమాలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ చిత్రం కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాత గౌరీ కృష్ణ మరియు దర్శకులు విప్రా గారికి ధన్యవాదాలు.. అని తెలిపారు.
బ్యానర్ : శ్రీ కృష్ణ క్రియేషన్స్
నటి నటులు: ఆదా శర్మ, సంజయ్, భాను శ్రీ, అభయ్, హరి తేజ, అక్షిత శ్రీనివాస్, అజయ్, తదితరులు
కెమెరా: వంశీ ప్రకాష్
ఎడిటర్: ఉద్ధవ్
ఆర్ట్ డైరెక్టర్: ఉప్పెందర్ రెడ్డి
పి ఆర్ ఓ: కుమార స్వామి
నిర్మాత: గౌరీ కృష్ణ
కథ, కథనం, దర్శకత్వం: విప్రా