Advertisementt

‘కె.జి.ఎఫ్’ తరహాలో ఆది సాయికుమార్ కొత్త చిత్రం

Sat 11th Jul 2020 02:11 PM
aadi saikumar,kgf film,chapter,pan india film,balaveer s,hero aadi saikumar,svr  ‘కె.జి.ఎఫ్’ తరహాలో ఆది సాయికుమార్ కొత్త చిత్రం
Aadi Saikumar Next film Is Pan India Project ‘కె.జి.ఎఫ్’ తరహాలో ఆది సాయికుమార్ కొత్త చిత్రం
Advertisement
Ads by CJ

బాహుబ‌లితో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. అప్ప‌టి నుండి మ‌న టాలీవుడ్ హీరోలంద‌రూ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో యువ క‌థానాయ‌కుడు ఆది సాయికుమార్‌ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఒక సిరీస్‌లా చేయడానికి ప్లాన్ చేస్తుండ‌టం విశేషం. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న ఆది సాయికుమార్ ఈ పాన్ ఇండియా చిత్రం త‌న‌కు పెద్ద బ్రేక్ అవుతుంద‌ని భావిస్తున్నారు. 

ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్క‌బోతున్న ఈ చిత్రంలో ఫాంట‌సీ ఎలిమెంట్స్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. య‌స్.వి.ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రై.లి బ్యాన‌ర్‌పై డెబ్యూ డైరెక్టర్ బాలవీర్.య‌‌స్‌ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న‌ ఈ చిత్రాన్ని య‌స్‌.వి.ఆర్ నిర్మిస్తున్నారు. ఇది వ‌ర‌కు ఆది సాయికుమార్ చేసిన చిత్రాల‌కు భిన్నంగా కామిక్ ట‌చ్‌తో సాగే చిత్ర‌మిది. మేక‌ర్స్ రెండేళ్ల పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌పై దృష్టి పెట్టారు. ప‌క్కా అంద‌రినీ ఆక‌ట్టుకునేలా స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఈ పాన్ ఇండియా సిరీస్‌లో చాప్ట‌ర్1 (కె.జి.ఎఫ్ తరహాలో) త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

Aadi Saikumar Next film Is Pan India Project:

Aadi Saikumar Next film follows KGF Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ