Advertisementt

రానా క్లాప్‌తో ప్రారంభమైన పాగల్!

Fri 20th Mar 2020 05:24 PM
viswaksen,paagal movie,rana daggubati,bekkam venugopal  రానా క్లాప్‌తో ప్రారంభమైన పాగల్!
Viswaksen Paagal Movie Launched రానా క్లాప్‌తో ప్రారంభమైన పాగల్!
Advertisement
Ads by CJ

క్రైమ్ థ్రిల్లర్ తో రూపొందిన ‘హిట్’ చిత్రం విశ్వక్ సేన్ కి మరొక సక్సెస్ లభించిందనే చెప్పాలి. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షలను అలరించింది. ఈ ఉత్సాహంతో హీరో విశ్వక్ సేన్ మరొక నూతన చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నరేష్ అనే ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ.. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ నటిస్తోన్న 5వ చిత్రమిది. ఈ చిత్రానికి పాగల్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో విశ్వక్ సేన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో రాణా దగ్గుపాటి క్లాప్ నివ్వగా, ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి త్రినాథ రావు నక్కిన హౌరావా దర్శకత్వం వహించారు. స్క్రిప్టును హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు చిత్ర యూనిట్ కి అందజేశారు.  

- ద‌ర్శ‌కుడు చెప్పిన స్క్రిప్ట్ ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించ‌డంతో ఈ సినిమా చేయ‌డానికి అంగీక‌రించాను..  నేను ఇప్ప‌టివ‌ర‌కూ  చేయ‌ని సరికొత్త జాన‌ర్‌లో ‘పాగ‌ల్’ సినిమా ఉంటుంది.. నరేష్ స్క్రిప్ట్ చెప్పగానే ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నాను. అంత బాగా నచ్చిన సబ్జెక్టు ఇది. ప్రేక్షలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.  నిర్మాత బిక్క వేణుగోపాల్ గారి బ్యానర్లో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది  అన్నారు..  హీరో విష్వ‌క్‌సేన్. 

విష్వ‌క్‌తో ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక క్రేజీ స‌బ్జెక్టుతో ఈ సినిమా తీస్తున్నాము. నరేష్ సూపర్బ్ స్క్రిప్ట్ నేరేట్ చేశాడు. కథకి యాప్ట్ అయ్యే విధంగా పాగల్ టైటిల్ పెట్టడం జరిగింది. ఈరోజు మంచి  ముహూర్తం కావ‌డంతో  లాంఛ‌నంగా సినిమాని ప్రారంభించాం. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక షెడ్యూళ్ల‌ను ప్లాన్ చేసి షూటింగ్ జరుపుతాం.  న‌రేష్ లాంటి టాలెంటెడ్ వున్నా వ్యక్తిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నందుకు హ్యాపీగా ఉంద‌ని చెప్పారు..నిర్మాత బెక్కం వేణుగోపాల్.  

- విష్వ‌క్‌సేన్ ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన సినిమాల‌కు పూర్తి భిన్న‌మైన స్క్రిప్టుతో ఈ సినిమా చేస్తున్నా. టైటిల్‌ని బ‌ట్టి ఇది యాక్ష‌న్ సినిమా అని అందరికి డౌట్ వస్తుంది.. కానీ ఇదొక  యూత్ ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టి  ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. ప్రేక్ష‌కుల‌కు క‌చ్చితంగా ఒక మంచి సినిమా చూశామ‌నే తృప్తి కలుగుతుంది.. బెక్కం వేణు గారు కథ విని ఇంప్రెస్స్ అయి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన బ్యానర్ ద్వారా హీరోగా లాంచ్ అవడం సంతోషంగా వుంది అని  ద‌ర్శ‌కుడు న‌రేష్ కుప్పిలి అన్నారు. 

ప్రముఖ నటీ నటులు నటించే ఈ చిత్రానికి సాంకేతిక బృందం:

పాట‌లు:  చంద్ర‌బోస్‌

సంగీతం: ర‌థ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌. మ‌ణికంద‌న్‌

ఎడిటింగ్‌: గ‌్యారీ బీహెచ్‌

ఆర్ట్‌:  టి.కె. మోహ‌న్‌

ఫైట్స్‌:  విక్ర‌మ్‌, దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌

కొరియోగ్ర‌ఫీ:  విజ‌య్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ల‌తా త‌రుణ్‌

ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  అనిల్ భాను

నిర్మాత‌:  బెక్కెం వేణుగోపాల్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: న‌రేష్ కుప్పిలి.

Viswaksen Paagal Movie Launched:

Rana daggubati Clap to Viswaksen Paagal Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ