మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" అనే సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం కాబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ స్నేహితుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ ౨వ తేదీన విడుదలకి సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
వైష్ణవ్ తేజ్ మొహం కనిపించకుండా సముద్రం కేసి చూస్తూ, గెలిచానన్నట్టుగా చేతులు చాపుతూ ఉన్న ఫోటో ఆసక్తిని కలిగించింది. అయితే ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకి వచ్చింది. ఫస్ట్ వేవ్ పేరుతో ఈ సినిమా నుండి గ్లింప్స్ వదిలారు. ఈ చిన్న వీడియో బైట్ కూడా చాలా ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. సముద్రం తీరాన ఉన్న వైష్ణవ్ తేజ్ బేబమ్మా అని అరుస్తూ చేతులు పైకి చాచగానే బస్ లో ఉన్న హీరోయిన్ ని చూపించారు. అది కూడా ఆమె మొహం పూర్తిగా కనబడకుండా గాలికి ఎగురుగున్న చున్నీ ఆమె మొహాన్ని అడ్డుపడుతూ ఉంటుంది. చూస్తుంటే ఈ చిన్న వేవ్ లోనే ఎంతో కాన్సెప్ట్ దాగుందని అనిపిస్తుంది.
ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఏ పోస్టర్ లోనూ హీరో, హీరోయిన్ల మొహాలు చూపించలేదు. ఇప్పుడు ఈ వేవ్ లోనూ అదే పద్దతి పాటించారు. మొత్తానికి వైష్ణవ్ తేజ్ ఏదో కొత్తదాన్ని క్రియేట్ చేయబోయేలా ఉన్నాడు.