Advertisementt

‘కొత్తగా మా ప్రయాణం’ కాన్సెఫ్ట్ ఏదో బాగుందే..

Wed 19th Dec 2018 09:37 AM
kothagaa maa prayanam,yamini bhaskar,kothagaa maa prayanam trailer released  ‘కొత్తగా మా ప్రయాణం’ కాన్సెఫ్ట్ ఏదో బాగుందే..
Kothagaa Maa Prayanam Trailer Released ‘కొత్తగా మా ప్రయాణం’ కాన్సెఫ్ట్ ఏదో బాగుందే..
Advertisement
Ads by CJ

ప్రియాంత్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ.. నిశ్చయ్ ప్రొడ‌క్షన్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కొత్తగా మా ప్రయాణం’. యామిని భాస్కర్ క‌థానాయిక‌. ‘ఈ వ‌ర్షం సాక్షిగా’ ఫేమ్ ర‌మ‌ణ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తై, నిర్మాణానంత‌ర ప‌నులు శరవేగంగా జరుపుకుంటోందీ చిత్రం. ఇటీవ‌లే రిలీజైన‌ టీజ‌ర్ ఆద్యంతం ఫ‌న్, ల‌వ్, యాక్షన్‌, వినోదంతో మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా చిత్ర ట్రైల‌ర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఆడియో త్వర‌లో రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా ద‌ర్శకుడు ర‌మ‌ణ మాట్లాడుతూ.. ‘‘ఇటీవ‌ల రిలీజైన టీజ‌ర్‌కి ప్రేక్షకుల నుంచి చ‌క్కని స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ట్రైల‌ర్‌ని రిలీజ్ చేశాం. దీనికి అద్భుత స్పంద‌న వ‌స్తోంది. త్వర‌లో ఆడియో రిలీజ్ చేయ‌నున్నాం. నిర్మాణానంత‌ర ప‌నులు వేగంగా జరుగుతున్నాయి. న‌వ‌త‌రం సినిమాల్లో యూనిక్ పాయింట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాం. క‌థాంశం చాలా ప్రామిసింగ్‌గా .. ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే ప‌రంగానూ కొత్తగా ఉండే చిత్రమిది. ప‌దిమందికి సాయ‌ప‌డుతూ ఓపెన్ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రేమ‌క‌థలో జరిగే ట్విస్టులేంటో తెర‌పైనే చూడాలి. అంద‌రికీ సాయ‌ప‌డే త‌త్వం ఉన్న హీరోకి.. ప్రేమ‌, పెళ్లి, కుటుంబం వంటి విలువ‌ల‌పై అంతగా న‌మ్మకం ఉండ‌దు. అయితే అలాంటివాడు మ‌న సాంప్రదాయం విలువ‌ను, గొప్పత‌నాన్ని తెలుసుకున్న త‌ర్వాత‌ ఎలా మారాడు? అన్నది ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా చూపించాం. నెల‌కు 2ల‌క్షల జీతం అందుకునే సాఫ్ట్‌వేర్ కుర్రాడి క‌థ ఇది. ప్రియాంత్‌కి తొలి సినిమానే అయినా త‌డ‌బ‌డ‌కుండా చ‌క్కగా న‌టించాడు. యామిని భాస్కర్ అంద‌చందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆక‌ర్షణ‌. ఆ ఇద్దరికీ మంచి పేరొస్తుంది. యువ‌త‌రాన్ని టార్గెట్ చేసి తీసిన ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నాము..అన్నారు.

భాను, గిరి, ఈరోజుల్లో సాయి, జీవా, కారుణ్య త‌దిత‌రులు నటించిన  ఈచిత్రానికి పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి, క‌రుణాక‌ర్‌, సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌, సాయి కార్తీక్, కెమెరా: అరుణ్ కుమార్, ఎడిటింగ్‌: న‌ంద‌మూరి హ‌రి.

Kothagaa Maa Prayanam Trailer Released:

Kothagaa Maa Prayanam Ready to Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ