Advertisementt

‘ఒడియ‌న్’లో ఏదో ఉన్నట్లే ఉంది..!

Mon 10th Dec 2018 08:36 AM
  ‘ఒడియ‌న్’లో ఏదో ఉన్నట్లే ఉంది..!
Odian Movie Teaser Released ‘ఒడియ‌న్’లో ఏదో ఉన్నట్లే ఉంది..!
Advertisement
Ads by CJ

ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 14న విడుద‌ల కానున్నమూవీలెజెండ్ మెహ‌న్‌లాల్ న‌టించిన ‘ఒడియ‌న్’ టీజ‌ర్ అదుర్స్‌

‘మ‌న్యంపులి, జ‌న‌తాగ్యారేజ్‌, క‌నుపాప’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తెలుగు సినీ అభిమానుల్ని ఆక‌ట్టుకున్న మ‌లయాళ మూవీ లెజెండ్ మోహ‌న్‌లాల్ ఇప్పుడు ‘ఒడియ‌న్’గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఈ చిత్ర తెలుగు హ‌క్కులు ద‌క్కించుకున్న‌ ద‌గ్గుపాటి క్రియేష‌న్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ ఆఫ‌ర్‌కి బిజినెస్ చేయ‌టం విశేషం. ఈ చిత్రానికి రామ్ ద‌గ్గుపాటి, సంప‌త్ కుమార్‌లు తెలుగు నిర్మాత‌లు. దర్శకుడు శ్రీ కుమార్ మీనన్. ఈ చిత్రం మ‌లయాళంలో అత్యంత భారీ ప్రెస్టీజియ‌స్ ఫిల్మ్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకోవ‌ట‌మే కాకుండా అన్ని భాష‌లతో పాటు తెలుగు ట్రేడ్‌లో కూడా చాలా మంచి క్రేజ్ రావ‌టం మెహ‌న్‌లాల్ గారి స్టామినా‌ని తెలియ‌జేస్తుంది. తాజాగా ‘ఒడియ‌న్’ చిత్ర తెలుగు టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. ఈ టీజర్ చూసిన వారంద‌రికి మెహ‌న్‌లాల్ మ‌రో వినూత్న‌ ప్ర‌యోగంతో ఒడియ‌న్‌గా వస్తున్నార‌నే విష‌యం తెలుస్తుంది. చాలా ఇంట్ర‌స్టింగ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 14న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు రామ్ ద‌గ్గుపాటి, సంప‌త్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం కోసం మోహ‌న్‌లాల్‌గారు యెగా మ‌రియు వ్యాయామాలు చేసి త‌న వ‌య‌సుని 55 సంవ‌త్స‌రాల నుండి 35 సంవ‌త్స‌రాలు కనిపించేలా శరీరాన్ని మార్చుకున్నారు. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో నిర్మిస్తుండ‌టంతో ఈ క్రేజీ ప్రాజెక్టు‌కి సౌత్ ఇండియా అంతా హ్యూజ్ క్రేజ్ వ‌చ్చింది. ఇంత‌టి అవ‌కాశాన్ని అందించిన మోహ‌న్‌లాల్ గారికి, నిర్మాత‌లకి మా ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని మలయాళం, త‌మిళం, తెలుగు ఇండ‌స్ట్రీల్లో డిసెంబ‌ర్ 14న విడుద‌ల చేయ‌నున్నారు. మోహ‌న్‌లాల్‌గారు చాలా విభిన్న‌మైన గెట‌ప్స్‌లో క‌నిపిస్తారు. దర్శకుడు శ్రీ కుమార్ మీనన్.. మోహన్‌లాల్‌గారిని 35 సంవత్సరాల వయసున్న  పాత్రలో చూపించనున్నారు. దీనికోసం మోహన్‌లాల్ గారు యోగాసనాలు వంటి ప్రక్రియలు 55 సంవత్సరాల వయస్సులో చేయడం హ్యాట్సాఫ్. పీటర్ హెయిన్స్ యాక్షన్, అద్భుతమైన గ్రాఫిక్స్ మెస్మరైజ్ చేస్తాయి. ఇది ప‌క్కా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ప్యాక్‌గా తెర‌కెక్కింది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన మొదటి లుక్‌కి అలాగే తాజాగా విడుదలైన టీజ‌ర్‌కి మంచి స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అన్ని చోట్లా బిజినెస్ కావ‌టం విశేషం. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి డిసెంబ‌ర్‌ 14న ఈ చిత్రం దేశ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాం..’’ అని అన్నారు.

Odian Movie Teaser Released:

Odian Movie Ready to Release on Dec 14

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ