Advertisementt

ప్రముఖ సంగీత దర్శకుడి ‘ప్యార్ ప్రేమ కాదల్’

Sun 16th Sep 2018 08:56 PM
yuvan shankar raja,pyar prema kadhal,tammareddy bharadwaja,pyar prema kadhal  ప్రముఖ సంగీత దర్శకుడి ‘ప్యార్ ప్రేమ కాదల్’
Popular Music Director Turns Producer ప్రముఖ సంగీత దర్శకుడి ‘ప్యార్ ప్రేమ కాదల్’
Advertisement
Ads by CJ

కళాశాల నేపథ్యంలో ‘సాగే ప్యార్ ప్రేమ కాదల్’

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు  యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ  కాదల్’. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతోంది. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్  లిమిటెడ్ బ్యానర్లో సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో నిర్మాతలు యువన్ శంకర్ రాజా మరియు విజయ్ మోర్వనేని కలిసి ‘ప్యార్ ప్రేమ కాదల్’ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ డైరెక్షన్ లో హరీష్ కళ్యాణ్, రైజా విల్సన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కళాశాల నేపథ్యంలో జరిగే ప్రేమకథ. 

ఎలన్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్ర కధ, ప్రేమలోని భావోద్వేగాలు ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తాయి. చిత్రానికి, పాటలు, నేపధ్య సంగీతం అద్భుతంగా అందించారు యువన్ శంకర్ రాజా. ఈ ప్యార్ ప్రేమ కాదల్ తెలుగు నాట కనువిందు చెయ్యడానికి అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.

సమర్పణ:తమ్మారెడ్డి భరద్వాజ, ప్రొడ్యూసర్స్:యువన్ శంకర్ రాజా,విజయ్ మోర్వనేని, మ్యూజిక్:యువన్ శంకర్ రాజా, దర్శకత్వం:ఎలన్

Popular Music Director Turns Producer:

Yuvan Shankar Raja Produces Pyar Prema Kadhal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ