జూలై 13న 'చినబాబు' విడుదల
కార్తీ, సయేష జంటగా నటించిన 'చినబాబు' సినిమాను జూలై 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించింది. సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.
దర్శకులు పాండిరాజ్ రైతుల సమస్యలను ఈ సినిమాలో చర్చించారు. మొదటిసారి రైతు పాత్రలో కార్తి కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ లో కార్తి చెప్పిన డైలాగ్స్ ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. రైతుల సమస్యలను చర్చిస్తూనే సినిమాలో కామెడీ, యాక్షన్ ఉండబోతోంది. శత్రు ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా నటించారు. హీరో సూర్య, నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి చినబాబు సినిమాను 2డి ఎంటర్టైన్మెంట్స్ మరియు ద్వారకా క్రియేషన్స్ బ్యానర్స్ లో నిర్మించారు.