Advertisementt

'అడ్డా, ఓటర్' దర్శకుడి నూతన చిత్రమిదే!

Thu 05th Jul 2018 08:19 AM
gs karthik,adda,voter,naveen chandra,bhargav manne  'అడ్డా, ఓటర్' దర్శకుడి నూతన చిత్రమిదే!
GS Karthik New Movie with Naveen Chandra 'అడ్డా, ఓటర్' దర్శకుడి నూతన చిత్రమిదే!
Advertisement
Ads by CJ

నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరోహీరోయిన్లుగా జి. ఎస్. కార్తీక్ దర్శకత్వంలో చిత్రం ప్రారంభం

స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరోహీరోయిన్లుగా 'అడ్డా, ఓటర్' చిత్రాల దర్శకుడు జి. ఎస్. కార్తీక్ దర్శకత్వంలో నిర్మాత భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం బుధవారం (జూలై 4) పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత భార్గవ్ మన్నె మాట్లాడుతూ.. దర్శకుడు కార్తీక్ మంచి కథ చెప్పారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంశాలు పుష్కలంగా ఉండటమే కాకుండా, సరి కొత్త పాయింట్ తో ఈ చిత్రం ఉంటుంది. కష్టపడే టీమ్ కుదిరింది. మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ చిత్రాన్ని మా బ్యానర్ ద్వారా అందిస్తాము..అన్నారు. 

చిత్ర దర్శకుడు జి. ఎస్. కార్తీక్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాము. నిర్మాత మరియు టీమ్ అందరి సహకారంతో అందరూ మెచ్చేలా, అందరికి నచ్చేలా ఈ సినిమా ఉంటుంది.. అని అన్నారు.

నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, డింపుల్ చొపాడియా, పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ పృథ్వి, అభిమన్యుసింగ్, జయప్రకాశ్, గౌతమ్ రాజు, శివన్నారాయణ, బమ్ చిక్ బబ్లూ మొదలగువారు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె, కెమెరా: వెంకట్ గంగాధరీ, ఎడిటర్: జునైద్ సిద్ధికి, నిర్మాత: భార్గవ్ మన్నె, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: జి. ఎస్. కార్తీక్.

GS Karthik New Movie with Naveen Chandra :

GS Karthik New Movie Started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ