Advertisementt

శ్రీనివాసుని కళ్యాణంకు ముహూర్తం పెట్టారు!

Wed 04th Jul 2018 10:51 PM
srinivasa kalyanam,august,release date,dil raju,nithiin  శ్రీనివాసుని కళ్యాణంకు ముహూర్తం పెట్టారు!
Srinivasa Kalyanam Movie Release Date Fix శ్రీనివాసుని కళ్యాణంకు ముహూర్తం పెట్టారు!
Advertisement
Ads by CJ

ఆగ‌స్ట్ 9న శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ 'శ్రీనివాస కళ్యాణం'

బొమ్మ‌రిల్లు, కొత్త బంగారులోకం, ప‌రుగు, బృందావ‌నం, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, శ‌త‌మానం భ‌వ‌తి.. లాంటి ఎన్నో సూప‌ర్‌డూప‌ర్ హిట్ కుటుంబ క‌థా చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌. గ‌త ఏడాది డ‌బుల్ హ్యాట్రిక్‌తో ఈ నిర్మాణ సంస్థ స‌రికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇలాంటి నిర్మాణ సంస్థ‌లో రూపొందుతోన్న చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. జీవితంలో పెళ్లి విశిష్ట‌త‌ను ఈ సినిమా ద్వారా తెలియ‌జేప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 

14 ఏళ్ల క్రితం హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, యువ హీరో నితిన్ కాంబినేషన్లో వచ్చిన 'దిల్' సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. చాలా గ్యాప్ త‌ర్వాత ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'శ్రీనివాస కళ్యాణం'. గ‌త ఏడాది జాతీయ స్థాయిలో ఉత్త‌మ ప్ర‌జాద‌ర‌ణ పొందిన 'శ‌త‌మానం భ‌వ‌తి' చిత్రాన్ని రూపొందించిన‌ డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..ఒక సాంగ్ కొంత ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. మిగిలిన షూటింగ్ పార్ట్‌ను, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జూలైలో పూర్తి చేసి ఆగ‌స్ట్ 9న‌ 'శ్రీనివాస‌ కళ్యాణం' సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాము. 12 సంవత్సరాల క్రితం ఇదే ఆగస్ట్ 9 రోజున బొమ్మరిల్లు విడుదల అయింది. మళ్ళీ అదే రోజున అదే స్థాయి విజయాన్ని 'శ్రీనివాస కళ్యాణం' తో అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.. అని చెప్పారు.

నితిన్‌, రాశీఖ‌న్నా, నందితా శ్వేత‌, ప్ర‌కాష్ రాజ్, రాజేంద్ర ప్ర‌సాద్‌ త‌దిత‌రులు ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్:  రామాంజ‌నేయులు, ఎడిటింగ్‌: మ‌ధు, సినిమాటోగ్ర‌ఫీ: స‌మీర్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : బండి రత్న కుమార్, సంగీతం:  మిక్కి జె.మేయ‌ర్‌, నిర్మాణం: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, కధ, మాటలు, స్క్రీన్ప్లే, ద‌ర్శ‌క‌త్వం: వేగేశ్న‌ సతీష్.

Srinivasa Kalyanam Movie Release Date Fix:

Srinivasa Kalyanam Release on August 9th 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ