Advertisementt

"డియర్ కామ్రేడ్" ప్రారంభం!

Mon 02nd Jul 2018 01:44 PM
vijay deverakonda,rashmika mandanna,dear comrade
Dear Comrade launched "డియర్ కామ్రేడ్" ప్రారంభం!
Advertisement
Ads by CJ

హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం "డియర్ కామ్రేడ్" సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దర్శకులు సుకుమార్, కొరటాల శివ, చంద్రశేఖర్ యేలేటి, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 

తొలి సన్నివేశానికి ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా, డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్ భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. సుకుమార్, కొరటాల శివ స్క్రిప్ట్ అందించారు. 

డియర్ కామ్రేడ్ చిత్రాన్ని భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీకి జై కృష్ణ మాటలు రాస్తున్నారు. రామాంజనేయులు ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు:  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

సాంకేతిక నిపుణులు: కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: భరత్ కమ్మ

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్, బిగ్ బెన్ సినిమాస్

నిర్మాతలు: నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చిరుకూరి(సి.వి.ఎం), యస్ రంగినేని

సి.ఈ.ఓ: చెర్రి

కో ప్రొడ్యూసర్: ప్రవీణ్ మర్పురి

సంగీతం: జస్టిన్ ప్రభాకరన్

కెమెరామెన్: సుజిత్ సరంగ్

ఎడిటర్: శ్రీజిత్ సరంగ్

డైలాగ్స్ : జై కుమార్

ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు

Dear Comrade launched :

Vijay Deverakonda as Dear Comrade launched 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ