శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకటేష్, వరుణ్‌తేజ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో లాంఛనంగా ప్రారంభమైన 'ఎఫ్2'వైవిధ్యభరితమైన సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపే అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ తో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు` వంటి సూపర్‌హిట్ తర్వాత.... మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో `ఫిదా` వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత.. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ... స్టార్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ 'ఎఫ్2' ప్రారంభోత్సం శనివారం హైదరాబాద్ దిల్‌రాజు కార్యాలయంలో జరిగింది. దేవుడి పటాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి హీరోలు వెంకటేష్, వరుణ్‌తేజ్‌లపై ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్, దిల్‌రాజు, వెంకటేష్, వరుణ్ తేజ్ స్క్రిప్ట్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడికి అందించారు.
'ఎఫ్2'.. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ ఉపశీర్షికతో తెరకెక్కబోయే ఈ సినిమా జూలై 5 నుండి రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కమర్షియల్ వ్యాల్యూస్‌తో కామెడీ ఎంటర్ టైనర్స్‌ను తెరకెక్కించే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను ఆద్యంతం ఫన్ రైడర్‌గా తెరకెక్కిస్తారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నాం.. అని యూనిట్ సభ్యులు తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ తదితరులు కూడా పాల్గొని యూనిట్‌కి శుభాకాంక్షలను అందించారు.