Advertisementt

నాగ‌శౌర్య‌తో భ‌వ్య క్రియేష‌న్స్ చిత్రం పూజయింది!

Sun 24th Jun 2018 02:00 PM
raja kolusu,naga shourya,bhavya creations,opening,naga shourya new movie  నాగ‌శౌర్య‌తో భ‌వ్య క్రియేష‌న్స్ చిత్రం పూజయింది!
Naga shourya movie in Bhavya Creations Banner నాగ‌శౌర్య‌తో భ‌వ్య క్రియేష‌న్స్ చిత్రం పూజయింది!
Advertisement
Ads by CJ

నాగ‌శౌర్య హీరోగా రాజా కొలుసు ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ్య క్రియేష‌న్స్ ఆనంద‌ప్ర‌సాద్ నూత‌న చిత్రం ప్రారంభం!

విభిన్నమైన  చిత్రాల‌ను నిర్మించే సంస్థ‌గా తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో భ‌వ్య క్రియేష‌న్స్ కు మంచి పేరు ఉంది. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 'పైసా వ‌సూల్‌' త‌ర్వాత ఈ సంస్థ తాజాగా ఓ సినిమాకు శ్రీకారం చుట్టింది. 'ఛ‌లో' సినిమాతో గ్రాండ్ స‌క్సెస్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుంది. కొత్త ద‌ర్శ‌కుడు రాజా కొలుసును ప‌రిచ‌యం చేస్తూ భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై  వి.ఆనంద ప్ర‌సాద్ నిర్మిస్తున్న తొమ్మిదో చిత్ర‌మిది. 

హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు శ‌నివారం ఉద‌యం లాంఛ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత ఆనంద‌ప్ర‌సాద్ స‌తీమ‌ణి కృష్ణ కుమారి, హీరో నాగ‌శౌర్య త‌ల్లి దండ్రులు ఉషా బాల‌, శంక‌ర‌ప్ర‌సాద్ తదితరులు పాల్గొన్నారు. ఆగ‌స్టు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత చెప్పారు. ఈ సినిమాకు కెమెరా: సాయి శ్రీరామ్‌, సంగీతం: మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్‌, ఆర్ట్: వివేక్‌,  ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: రాజా కొలుసు.

Naga shourya movie in Bhavya Creations Banner :

Raja Kolusu Directs Naga Shourya in Bhavya Creations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ