Advertisementt

శ్రీవిష్ణు సినిమా ప్రారంభమైంది..!

Fri 22nd Jun 2018 10:43 PM
sree vishnu,tippara meesam,nara rohit,vijay,talasani srinivas yadav  శ్రీవిష్ణు సినిమా ప్రారంభమైంది..!
Hero Sree Vishnu’s new film launched శ్రీవిష్ణు సినిమా ప్రారంభమైంది..!
Advertisement
Ads by CJ

'రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్', 'కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్' బ్యానర్సపై 'శ్రీ ఓం సినిమా' సమర్పణలో కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న సినిమా ఈరోజు ప్రారంభం అయ్యింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా నారా రోహిత్ క్లాప్ కొట్టడం జరిగింది. 

ఈ సందర్బంగా దర్శకుడు విజయ్ ఎల్ మాట్లాడుతూ...అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకేకథ చిత్రాల తరువాత ఈ సినిమాకు నిర్మాణ భాగస్వాయం చేస్తూ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది.  జూలైలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ...విజయ్ గారితో వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. మిగిలిన చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నాను. కొన్ని ఏళ్లుగా మేము కలిసి పనిచేస్తున్నాము. ఈ సినిమా అందరికి నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను.. అన్నారు.

నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ... డైరెక్టర్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు కొత్తగా ఫీల్ అయ్యాను. సినిమాను త్వరగా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాను. కథ చాలా విభిన్నంగా ఉండబోతోంది. ఒక మంచి సినిమాను అందరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను..అన్నారు. 

సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ... ఆరెన్ మీడియా వర్క్స్ లో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. డైరెక్టర్ విజయ్ గారితో వర్క్ చెయ్యడం పాజిటివ్ గా ఉంటుంది. మంచి కథా బలం ఉన్న సినిమాకు వర్క్ చెయ్యడం ఆనందంగా ఉంది.. అన్నారు.

Hero Sree Vishnu’s new film launched :

Hero Sree Vishnu Tippara Meesam Film Launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ