జూన్ 21న 'పంతం' ఆడియో రిలీజ్ - నిర్మాత కె.కె.రాధామోహన్
టాలీవుడ్ యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.,రాధామోహన్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'. గోపీచంద్ 25వ చిత్రమిది. 'బలుపు', 'పవర్', 'జై లవకుశ' వంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేసిన కె.చక్రవర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
'పంతం' గురించి నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ..మా సంస్థలో ఏడో చిత్రం. గోపీచంద్‌గారు నటిస్తోన్న 25వ సినిమా 'పంతం'. చాలా ప్రెస్టీజియస్‌గా నిర్మించాం. మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నిర్మాణానంతర పనులు వేగంగా జరుగుతున్నాయి. జూలై 5న విడుదల చేస్తామని మేం ఏప్రిల్‌లోనే చెప్పాం. ఆ ప్రకారమే ప్రణాళిక వేసుకుని చిత్రీకరిస్తున్నాం. ఇటీవల యు.కె.,లండన్, స్కాట్లండ్ లో కీలక సన్నివేశాలను, పాటలను చిత్రీకరించాం. ఈ నెల 21న విజయవాడలో ఆడియో, 24న వైజాగ్‌లో ఫంక్షన్ చేస్తాం. ప్రమోషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాం. మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ టీమ్‌తో చేశాం.. అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ..నేను, మా టీమ్ కలిసి మంచి ప్రయత్నం చేశాం. సినిమా చాలాబాగా వచ్చింది. జూలై 5న విడుదల చేస్తాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం.. అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్ డైరక్టర్ ఎ.ఎస్.ప్రకాష్ కూడా పాల్గొన్నారు.
గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో మెహరీన్ నాయిక. పృథ్విరాజ్, జయప్రకాష్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్.ప్రకాష్, మాటలు: రమేశ్ రెడ్డి, స్క్రీన్‌ప్లే: కె.చక్రవర్తి, బాబీ (కె.ఎస్.రవీంద్ర), కో డైరక్టర్: బెల్లంకొండ సత్యం బాబు, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ప‌్రసాద్ మూరెళ్ల, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ, దర్శకత్వం: కె.చక్రవర్తి.