Advertisementt

సంక్రాంతికే.. చరణ్ ఫిక్సయ్యాడు..!

Sun 17th Jun 2018 06:47 PM
  సంక్రాంతికే.. చరణ్ ఫిక్సయ్యాడు..!
Ram Charan and Boyapati Film Release Date Locked సంక్రాంతికే.. చరణ్ ఫిక్సయ్యాడు..!
Advertisement
Ads by CJ

భారీ యాక్ష‌న్ ఏపిసోడ్ చిత్రీక‌ర‌ణ‌లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను చిత్రం ..సంక్రాంతి విడుద‌ల‌

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా నాలుగో షెడ్యూల్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ యాక్ష‌న్ ఏపిసోడ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. హీరోలోని మాస్ యాంగిల్‌ను ప్రెజెంట్ చేస్తూ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను సిద్ధ‌హ‌స్తుడు. ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్‌ని మ‌రే ద‌ర్శ‌కుడు చూపించ‌ని యాక్ష‌న్ సీక్వెన్స్‌లో బోయ‌పాటి ఆవిష్క‌రించ‌నున్నారు. 5 కోట్ల భారీ వ్య‌యంతో ఈ యాక్ష‌న్ పార్ట్‌ను చేస్తున్నారు. ఇందులో 60 మంది ఆర్టిస్టులు, 500 మంది బాడీ బిల్డ‌ర్స్ పాల్గొంటారు. సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి మాట్లాడుతూ.. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కాంబినేష‌న్‌తో మా బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. ఇటీవ‌లే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ యాక్ష‌న్ ఏపిసోడ్‌ను చేస్తున్నాం. హై ఎండ్‌యాక్ష‌న్ పార్ట్‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న అభిమానులను డెఫ‌నెట్‌గా మెప్పిస్తుంది. మెగాభిమానులు, ప్రేక్ష‌కులను అల‌రించేలా రామ్‌చ‌ర‌ణ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ప‌వ‌ర్ ప్యాక్‌డ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందిస్తున్నాం. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే సంక్రాంతికి వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం..అన్నారు. 

రామ్‌చరణ్‌, కైరా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టిల్స్:  జీవ‌న్‌, పి.ఆర్‌.ఒ : వ‌ంశీ కాకా, మాటలు: ఎం.రత్నం, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరామెన్‌: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వి.వై.ప్రవీణ్ కుమార్, స‌హ నిర్మాత‌: క‌ల్యాణ్ డి.వి.వి, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Ram Charan and Boyapati Film Release Date Locked:

High-octane action episode being shot for Ram Charan’s next with Boyapati Srinivas; Sankranti 2019 release planned

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ