Advertisementt

'గూఢచారి' వచ్చేది ఎప్పుడంటే..?

Sun 17th Jun 2018 11:32 AM
goodachari,adivi sesh,shooting complete,release date  'గూఢచారి' వచ్చేది ఎప్పుడంటే..?
Adivi Sesh’s ‘Goodachari’ release date locked! 'గూఢచారి' వచ్చేది ఎప్పుడంటే..?
Advertisement
Ads by CJ

అడవి శేష్, శోభిత ధూలిపాళ్ళ హీరో హీరోయిన్స్ గా నటించిన 'గూఢచారి' సినిమా ట్రైలర్, పాటలు త్వరలో రిలీజ్ చేసి ఆగష్టు 3న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ద్వారా  శశికిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. సినిమా చిత్రీకరణ అధికభాగం అమెరికా, హిమాచల్ ప్రదేశ్, పూణే, న్యూ ఢిల్లీ, చిట్టిగాంగ్, హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రేదేశాల్లో జరిగింది.  'గూఢచారి' సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హైటెక్నీకల్ వాల్యూస్ తో రూపొందించబడింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాతో వెండితెరపై రీ ఎంట్రి ఇవ్వబోతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాకు శనీల్ డియో సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేశారు. 'అభిషేక్ పిక్చర్స్', 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ', 'విస్టా డ్రీమ్ మర్చెంట్' బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Adivi Sesh’s ‘Goodachari’ release date locked!:

Goodachari Movie Shooting Completed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ