Advertisementt

'టిక్ టిక్ టిక్' మంటూ 22న వస్తున్నారు!

Wed 13th Jun 2018 10:17 PM
tik tik tik movie,release,june 22,censor  'టిక్ టిక్ టిక్' మంటూ 22న వస్తున్నారు!
Tik Tik Tik Movie Censor Completed 'టిక్ టిక్ టిక్' మంటూ 22న వస్తున్నారు!
Advertisement
Ads by CJ

ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలో తొలి అంత‌రిక్ష సినిమాగా  'టిక్ టిక్ టిక్' విడుదలకు సిద్దమవుతోంది. విలక్షణమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించటంలో ముందుండే చదలవాడ బ్రదర్స్ టిక్ టిక్ టిక్ ను టాలీవుడ్ లోకి అనువదిస్తున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి , చదలవాడ లక్ష్మణ్ జూన్ 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

చదలవాడ లక్ష్మణ్ మాట్లాడుతూ. టిక్ టిక్ టిక్ సెన్సార్ పూర్తయింది. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. అంతరిక్షం నేప‌థ్యంలో రూపొందిన తొలి ఇండియ‌న్ మూవీ ఇది. సినిమా చూసే ప్రతి ప్రేక్ష‌కుడు థ్రిల్ అయ్యేలా ఉంటుంది‌. ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా. ఇప్పటికే విడుద‌లైన ట్రైల‌ర్‌ మిలియన్ వ్యూస్ ను రీచ్ అయింది. 'బిచ్చ‌గాడు', డి16 సినిమాలను తెలుగులో విడుద‌ల చేసిన‌ప్పుడు ఇక్క‌డి ప్రేక్ష‌కులు ఎంత‌గానో  మా చిత్రాలను ఆద‌రించారు. వాటిని  మించేలా తెరకెక్కిన విల‌క్ష‌ణ‌మైన స‌బ్జెక్ట్ ఇది.

అద్బుతమైన విజువల్స్ , గ్రాఫిక్ వర్క్ తో పాటు, థ్రిల్ కలిగించే సౌండ్ ఎఫెక్ట్ తో టిక్ టిక్ టిక్ సిద్దమయింది. ఆడియెన్స్ కి ఇదొక విజువల్ ఫీస్ట్. థియేటర్ లో చూస్తేనే ఆ అనుభూతిని పొందగలరు. తెలుగు, తమిళ భాషల్లో జూన్ 22న గ్రాండ్ గా విడుదల చేస్తున్నామన్నారు.

Tik Tik Tik Movie Censor Completed:

Tik Tik Tik Movie Ready to Release on June 22nd

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ