Advertisementt

త్వరలోనే 'అభిమన్యుడు 2': విశాల్!

Tue 12th Jun 2018 08:02 PM
vishal,abhimanyudu 2,abhimanyudu  త్వరలోనే 'అభిమన్యుడు 2': విశాల్!
We Will Start Abhimanyudu 2 soon, says vishal త్వరలోనే 'అభిమన్యుడు 2': విశాల్!
Advertisement
Ads by CJ

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనర్స్‌పై ఎమ్‌. పురుషోత్తమ్‌ సమర్పణలో యువ నిర్మాత జి.హరి నిర్మించిన చిత్రం 'అభిమన్యుడు'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్‌ టాక్‌తో రెండవ వారంలో కూడా సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం వైజాగ్‌ సిఎమ్‌ఆర్‌ మాల్‌లో వేలాది మంది అభిమానులు, ప్రేక్షకులతో తమ విజయానందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా.. 

మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ 'ముందుగా 'అభిమన్యుడు' చిత్రాన్ని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మొదటి నుండి నన్నెంతగానో ఆదరిస్తున్నారు. ఈ విజయంతో నాకు మరింత ఉత్సాహాన్నిచ్చారు. త్వరలోనే ఇదే టీమ్‌తో 'అభిమన్యుడు-2' మొదలు పెట్టబోతున్నాం. 'పందెంకోడి-2' విజయదశమికి రిలీజ్‌ అవుతుంది' అన్నారు. 

నిర్మాత గుజ్జలపూడి హరి మాట్లాడుతూ 'నిర్మాతగా ఇది నాకు చాలా పెద్ద విజయం. ఈ విజయాన్ని అందించిన విశాల్‌కి, ప్రేక్షకులకి కృతజ్ఞతలు' అన్నారు. 

దర్శకుడు పి.ఎస్‌.మిత్రన్‌ మాట్లాడుతూ 'మంచి సినిమాకి ఎక్కడైనా అద్భుతమైన ఆదరణ లభిస్తుందని ఈ విజయం నిరూపించింది. ఇంత మంది సమక్షంలో విజయోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది' అన్నారు. 

We Will Start Abhimanyudu 2 soon, says vishal:

Abhimanyudu 2 on Cards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ