'దేశంలో దొంగలు పడ్డారు' టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్
ఖయూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీ రాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రల్లో సారా క్రియేషన్స్ పై గౌతమ్ రాజ్ కుమార్ దర్శకత్వంలో రమా గౌతమ్ నిర్మిస్తున్న చిత్రం 'దేశంలో దొంగలు పడ్డారు'. ఈ సినిమా టీజర్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. టీజర్ చాలా నచ్చింది. చూడగానే ఇంప్రెస్ అయ్యాను. టైటిల్ అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి టీం అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్..అని అన్నారు.
చిత్ర దర్శకుడు గౌతమ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ముందుగా మా టీజర్ ను ఆవిష్కరించి మమ్మల్ని ఆశీర్వదించిన పూరి గారికి ధన్యవాదాలు తెపుకుంటున్నా. సినిమా షూటింగ్ పూర్తయింది. వైజాగ్, సీలేరు, చింతపల్లి, డొంకరాయ, హైదరాబాద్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ చేసాం. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ చేయని లోకేషన్లలో షూటింగ్ చేసాం. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. హ్యామన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ తెరకెక్కిస్తున్నాం. ఇప్పుడు సమాజంలో జరుగుతోన్న విషయాలను ప్రతిబింబిస్తూ ఈ కాన్సెప్ట్ ను తీర్చిదిద్దాం. కథలో అన్ని ఎమోషన్స్ డిఫరెంట్ డైమెన్షన్ లో కనిపిస్తాయి. ముఖ్యంగా క్రైమ్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.. అన్నారు.
చిత్ర నిర్మాత రమా గౌతమ్ మాట్లాడుతూ.. మా చిత్ర టీజర్ విడుదల చేసిన పూరి జగన్నాథ్ గారికి కృతజ్ఞతలు. కథకు తగ్గట్టుగా మంచి నటీనటులు కుదిరారు. నటీనటులంతా బాగా నటించారు. షూటింగ్ పూర్తయింది. అవుట్ ఫుట్ బాగా వచ్చింది. క్రైమ్ జోనర్లో కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము.. అని అన్నారు.
సహ నిర్మాత సంతోష్ డొంకాడ మాట్లాడుతూ.. ఫ్రెండ్ షిప్, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ ఉండే కథ ఇది. కానీ అవి ఇరికించినట్టుగా ఉండవు. యువతకు బాగా కనెక్ట్ అవుతుంది.. అన్నారు.
హీరో ఖయూం మాట్లాడుతూ.. అడగగానే మా సినిమా టీజర్ విడుదల చేసినందుకు ముందుగా పూరి గారికి మా టీం అందరి తరుపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎన్నో సినిమాలు చేసినప్పటికీ నటుడిగా నాకో కొత్త అనుభూతినిచ్చిన చిత్రమిది. గౌతమ్ రాజ్ కుమార్ గారు చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం.. అన్నారు.