Advertisementt

సమ్మోహనం సెన్సార్ పూర్తి- రిలీజ్ కు రెడీ!

Fri 08th Jun 2018 08:48 PM
sudheer babu,aditi rao hydari,sammohanam,censor,details  సమ్మోహనం సెన్సార్ పూర్తి- రిలీజ్ కు రెడీ!
Sammohanam Censor Completed సమ్మోహనం సెన్సార్ పూర్తి- రిలీజ్ కు రెడీ!
Advertisement
Ads by CJ

అనూహ్య‌మైన క‌థాంశంతో ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కిన `స‌మ్మోహ‌నం` సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సుధీర్‌బాబు హీరోగా  మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో  శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం `స‌మ్మోహ‌నం`. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో నాయిక‌గా న‌టించారు.  శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా ఈ చిత్రం తెర‌కెక్కింది.  

నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ.. 'మేం ముందుగా అనుకున్న విధంగానే సినిమా చాలా బాగా వ‌చ్చింది. సెన్సార్ స‌భ్యులు చూసి మెచ్చుకున్నారు. క్లీన్ యు స‌ర్టిఫికెట్ ఇచ్చారు. ఈ నెల 15న `స‌మ్మోహ‌నం` విడుద‌ల చేస్తున్నాం. అంద‌మైన క‌థ‌, అర్థ‌వంత‌మైన సంభాష‌ణ‌లు, విన‌సొంపైన బాణీలు, అద్భుత‌మైన లొకేష‌న్లు సినిమాకు ప్ల‌స్ అవుతాయి. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప్రాణం పెట్టి ప‌నిచేశారు. వివేక్ సాగ‌ర్ స్వ‌ర‌ప‌ర‌చిన పాట‌ల‌ను ఇటీవ‌ల ఆన్‌లైన్‌లో విడుద‌ల చేశాం. చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ నెల 10న సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హిస్తాం' అని అన్నారు. 

ద‌ర్శ‌కుడు  మోహన్‌కృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ 'మా చిత్రంలో హీరో చిల్డ్ర‌న్స్ బుక్స్ కి ఇల్ల‌స్ట్రేట‌ర్‌గా ప‌నిచేస్తుంటారు. రొమాన్స్, హాస్యం స‌మ్మిళిత‌మైన క‌థ ఇది.  అనూహ్య‌మైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రాన్ని `స‌మ్మోహ‌నం`లో చూడొచ్చు.  పి.జి.విందా ఫొటోగ్ర‌ఫీ హైలైట్ అవుతుంది. వివేక్ సాగ‌ర్ ట్యూన్లు ఆక‌ట్టుకుంటాయి.  టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమా మొత్తం అంద‌మైన  ఫీల్ క్యారీ అయి స‌మ్మోహ‌నంగా అనిపిస్తుంది. ఈ నెల 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం' అని చెప్పారు. 

న‌టీన‌టులు: సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేష్, త‌నికెళ్ల భ‌ర‌ణి, పవిత్రా లోకేష్ , హర్షిణి , నందు,  కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, కేదార్ శంక‌ర్‌, శిశిర్‌శ‌ర్మ త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు: 

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్:  పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌:  కోట సురేష్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్. ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌, కె.వెంక‌టేశ్‌;  డైర‌క్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీ:  పి.జి.విందా,  సంగీతం:  వివేక్ సాగ‌ర్‌, నిర్మాత‌:  శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌,  ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం:  మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి. 

Sammohanam Censor Completed:

Sammohanam Censor Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ