నాగ సౌర్య హీరోగా సుందర్ సూర్య దర్శకత్వంలో స్వాజిత్ మూవీస్ పతాకం పై కె ఆర్ సహా నిర్మాత గా రాజేష్ నిర్మించిన 'అమ్మమ్మ గారిల్లు'. విడుదల అయ్యి విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగు పెట్టుకొంది. ఇప్పటికి మంచి కలెక్షన్స్ తో ప్రదర్సితమవుతుందని చిత్ర దర్శకులు సుందర్ సూర్య చెబుతూ...దర్శకుడిగా నా మొదటి చిత్రాన్ని ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకు ముందుగా నా కృతజ్నతలు. మంచి సినిమాని ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువు చేసిన చిత్రం మా 'అమ్మమ్మ గారిల్లు' అని అన్నారు.
నిర్మాతలు రాజేష్, కె ఆర్ మాట్లాడుతూ ఈ కథ మీద వున్న నమ్మకంతో ఈ సినిమా ప్రారంభించాం. మా అంచనాలకు మించి పెద్ద విజయాన్ని ప్రేక్షక దేవుళ్ళు అందించినందుకు చాలా సంతోషంగా వుంది. మాకు సహకరించిన ప్రతి నటీనటులకు అందరికీ థాంక్స్.. మూడో వారంలో మరికొన్ని థియేటర్స్ పెంచుతున్నాం. నిర్మాతలుగా మాకు మా స్వాజిత్ మూవీస్ సంస్థకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం మా 'అమ్మమ్మ గారిల్లు' అని అన్నారు.