Advertisementt

'పంతం' టీజ‌ర్‌కి స్పంద‌న‌ అదిరింది..!

Wed 06th Jun 2018 03:57 PM
  'పంతం' టీజ‌ర్‌కి స్పంద‌న‌ అదిరింది..!
Overwhelming Response to Pantham Teaser 'పంతం' టీజ‌ర్‌కి స్పంద‌న‌ అదిరింది..!
Advertisement
Ads by CJ

శ్రీ స‌త్య సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'. గోపీచంద్ న‌టిస్తోన్న 25వ సినిమా ఇది. 'బ‌లుపు, ప‌వ‌ర్‌, జై ల‌వ‌కుశ‌' వంటి చిత్రాల‌కు స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా ప‌నిచేసిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. 'చెప్పుకోవ‌డానికి ఇదేం కొత్త క‌థ కాదు. దేశం పుట్టిన‌ప్ప‌టి నుంచి మ‌నం చెప్పుకొనే క‌థ‌...' అంటూ 'పంతం' టీజ‌ర్ మంగ‌ళ‌వారం విడుద‌లైంది. టీజ‌ర్‌లో 'ఇప్ప‌టికైనా చెప్పండి మీరేం చేస్తుంటారు' అని పృథ్వి అడిగితే 'లోప‌లున్న‌ది బ‌య‌టికి తీస్తాం. బ‌య‌టున్న‌ది లోప‌లికి తోస్తాం.. టింగ్ టింగ్‌' అని గోపీచంద్‌, శ్రీనివాసరెడ్డి చెప్పే తీరు క‌డుపుబ్బ న‌వ్విస్తోంది. కోర్టులో నిలుచుని గోపీచంద్ చెప్పే 'ఫ్రీగా ఇల్లిస్తాం, క‌రెంట్ ఇస్తాం. రుణాలు మాఫీ చేస్తాం. ఓటుకు ఐదు వేలు ఇస్తాం అని అన‌గానే ముందు, వెనుకా, మంచీ చెడూ ఆలోచించ‌కుండా ఓటేసేసి... అవినీతి లేని స‌మాజం కావాలి,  క‌రెప్ష‌న్ లేని కంట్రీ కావాలంటే ఎక్క‌డినుంచి వ‌స్తాయ్‌?' అనే డైలాగు అర్థ‌వంతంగా, ఆలోచింప‌జేసేలా, భావోద్వేగపూరితంగా ఉంది. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కు ఉండాల్సిన అన్ని ర‌కాల అంశాల‌తో సినిమా అద్భుతంగా తెర‌కెక్కింద‌ని టీజ‌ర్ చెప్ప‌క‌నే చెబుతోంది. 

'పంతం' గురించి నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ.. గోపీచంద్ న‌టిస్తోన్న 25వ చిత్రాన్ని మా బ్యాన‌ర్‌లో నిర్మించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో కేవ‌లం వినోదం మాత్ర‌మే కాదు, ఆలోచింప‌జేసే అంశాలు కూడా పుష్క‌లంగా ఉన్నాయి. టాకీ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్నాం. త్వ‌ర‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసి జూలై 5న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తున్నందుకు ఆనందంగా ఉంది. ఔట్‌పుట్ చూసుకున్న త‌ర్వాత చాలా సంతృప్తిక‌రంగా, ఆనందంగా ఉంది.. అని అన్నారు.

గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో మెహ‌రీన్ నాయిక‌. పృథ్విరాజ్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌, మాట‌లు: ర‌మేశ్ రెడ్డి, స్క్రీన్‌ప్లే: కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ (కె.ఎస్‌.ర‌వీంద్ర‌), కో డైర‌క్ట‌ర్‌:  బెల్లంకొండ స‌త్యం బాబు, సంగీతం: గోపీ సుంద‌ర్‌, కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాత‌:  కె.కె.రాధామోహ‌న్‌,  క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: కె.చ‌క్ర‌వ‌ర్తి.

Click Here for Teaser

Overwhelming Response to Pantham Teaser:

Producer Happy with Pantham Teaser Response

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ