Advertisementt

'RX 100' రిలీజ్ డేట్ ఫిక్స్..!

Mon 04th Jun 2018 09:57 PM
  'RX 100' రిలీజ్ డేట్ ఫిక్స్..!
RX 100 Release Date Fixed 'RX 100' రిలీజ్ డేట్ ఫిక్స్..!
Advertisement
Ads by CJ

మా 'RX 100' టీజ‌ర్‌కి యూట్యూబ్‌లో ఆరు ల‌క్ష‌ల ఆర్గానిక్ వ్యూస్ వ‌చ్చాయి. ఓ చిన్న చిత్రం టీజ‌ర్‌కి ఇన్ని వ్యూస్ రావ‌డం అరుదైన విష‌యం. టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి బిజినెస్ వ‌ర్గాల్లోనూ మా సినిమాకు క్రేజ్ అమితంగా పెరిగింది.. అని అంటున్నారు అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ‌. KCW  బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మిస్తున్న‌చిత్రం 'RX 100'. ఈ చిత్రానికి అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి.  An Incredible Love Story  అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌.  కార్తికేయ, పాయల్ రాజపుత్‌  హీరోహీరోయిన్లు. రావురమేష్, సింధూర పువ్వు రామ్‌కీ ఇందులో కీలక  పాత్రధారులు.  

దర్శ‌కుడు అజ‌య్ భూప‌తి మాట్లాడుతూ.. ఓ చిన్న టౌన్ నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. రియ‌లిస్టిక్ ల‌వ్ స్టోరీ ఇది. RX 100 బైక్ సౌండ్‌లోనే తెలియ‌ని పొగ‌రు ఉంటుంది. మా హీరో శివ పాత్ర కూడా అలాగే ఉంటుంది. ఒక ర‌క‌మైన నిర్ల‌క్ష్య ధోర‌ణితో సాగే పాత్ర అత‌నిది. తెలుగులో ఇలాంటి ప్రేమ‌క‌థ ఇప్ప‌టివ‌ర‌కూ రాలేదు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది. చిన్న చిత్రం టీజ‌ర్‌కి ఆరు ల‌క్ష‌ల ఆర్గానిక్ వ్యూస్ రావ‌డ‌మంటే తేలికైన విష‌యం కాదు. మా టీజ‌ర్‌ను అంత‌లా ఆద‌రించిన వారికి మ‌నస్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు. సినిమా కూడా అంత‌కు వెయ్యి రెట్లు మెప్పిస్తుంది.. అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ.. టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి బిజినెస్ వ‌ర్గాల్లో మా సినిమాకు అమాంతం క్రేజ్ పెరిగింది. యువ‌త‌కు టీజ‌ర్ చాలా బాగా న‌చ్చింది. వాళ్ల‌ను మెప్పించే అంశాల‌న్నీ ఉన్నాయి. కేవ‌లం యువ‌త‌కే కాదు, అన్ని వ‌ర్గాల‌వారినీ ఆక‌ట్టుకుంటుందీ చిత్రం. క‌థ‌కు స‌రిపోయే టైటిల్‌ని పెట్టాం. ఆత్రేయ‌పురం ప‌రిస‌రాల అందాల‌ను కెమెరాలో బంధించాం. ప్ర‌స్తుతం రీరికార్డింగ్ జ‌రుగుతోంది. జూలై 5న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. నాయికానాయ‌కులు త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు..అని అన్నారు. 

నటీనటులు:

కార్తికేయ, పాయల్ రాజపుత్‌, రావు రమేష్, రాంకీ ( సింధూర పువ్వు ఫేమ్ ), సత్య, గిరిధర్, లక్ష్మణ్ త‌దిత‌రులు.

సాంకేతిక  వర్గం:

మ్యూజిక్: చైతన్ భరద్వాజ్ ,లిరిక్స్: శ్రీమణి , చైతన్య ప్రసాద్, సిరాశ్రీ, కొరియోగ్రఫీ:స్వర్ణ, అజయ్, సురేష్ వర్మ, స్టంట్స్:  రియల్ సతీష్ ,  ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి, ఎడిటర్: ప్రవీణ్. కే .ఎల్ ( కబాలి ఫేమ్ ),  సినిమాటోగ్రఫీ: రామ్, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, ఎగ్జిక్యూటివ్: సూర్య నారాయణ, నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ , రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.

RX 100 Release Date Fixed:

RX 100 Movie Release on July 5th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ