Advertisementt

హీరో శ్రీనివాస్, హీరోయిన్ కాజల్.. బిజినెస్ కేక..!

Sat 02nd Jun 2018 09:32 PM
bellamkonda sai sreenivas,kajal agarwal,hindi rights,vamsadhara creations  హీరో శ్రీనివాస్, హీరోయిన్ కాజల్.. బిజినెస్ కేక..!
Kajal Aggarwal joins the sets of Bellamkonda Sai Sreenivas Film హీరో శ్రీనివాస్, హీరోయిన్ కాజల్.. బిజినెస్ కేక..!
Advertisement
Ads by CJ

యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మించనున్నారు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ చిత్ర టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ చిత్ర హిందీ శాటిలైట్ రైట్స్ 9 కోట్ల 50 లక్షలకు అమ్ముడు అయ్యాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించబడుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితీష్ ముఖేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ మధ్య కొన్ని కీలక సీన్స్ చిత్రీకరుస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. చోటా కె నాయడు సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు.

హర్షవర్ధన్ రాణే ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో సత్యం రాజేష్, కళ్యాణి నటరాజన్, అపూర్వ ఈ మొవీలో మరో ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చాగంటి శాంతయ్య కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రంగస్థలం సినిమా తరువాత చంద్రబోస్ ఈ సినిమాకు సింగిల్ కార్డు రచయితగా పని చెయ్యడం విశేషం.

Kajal Aggarwal joins the sets of Bellamkonda Sai Sreenivas Film:

Record Price to Bellamkonda Sai Sreenivas Film Hindi Rights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ